Fuel tanker explosion in Liberia: పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో ఘోర దుర్ఘటన సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి ప్రజలు గుమిగూడిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని లైబీరియా అధికారులు వెల్లడించారు. టోటోటా పట్టణంలో మంగళవారం జరిగిన పేలుడులో 83 మంది గాయపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు.
మృతుల్లో చాలా మంది గుర్తుపట్టలేనతంగా కాలిపోయారు. దీంతో చనిపోయిన వారిలో కొంత మందిని బుధవారం సామూహికంగా సమాధి చేసినట్లు బాంగ్ కౌంటీ ఆరోగ్య అధికారి డాక్టర్ సింథియా బ్లాపూక్ తెలిపారు. లైబీరియా వైస్ ప్రెసిడెంట్ జ్యువెల్ హోవార్డ్-టేలర్ సామూహిక అంత్యక్రియలకు హాజరయ్యారు. ''కొత్త సంవత్సరం ఇలా ప్రారంభిస్తామని మేము ఊహించలేదు'' అని టేలర్ చెప్పాడు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడానికి విపత్తు నిర్వహాన్ని బృందాన్ని ఏర్పాటు చేయాలని వైద్యాధికారి ఒకరు లైబీరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
రీసెంట్ గా మధ్యప్రదేశ్‌లో కూడా ఘోర ప్రమాదం సంభవించింది. గుణ నుంచి ఆరోన్ వెళ్తున్న బస్సు బంపర్ ఢీ కొని బోల్తాపడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికుల అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. 11 మంది మృతదేహాల్ని బయటకు తీశారు. స్థానిక ప్రజలు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా మంటల్లోంచి ప్యాసింజర్స్ ను రక్షించారు. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు, గాయపడివారికి 50 వేల రూపాయలు సహాయం ప్రకటించారు సీఎం మోహన్ యాదవ్.
Also Read: US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook