Sheikh Hasina Back To Bangladesh: తీవ్ర రాజకీయ సంక్షోభంతోపాటు యుద్ధం మాదిరి జరిగిన పరిణామాలతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశంలో శరణార్థిగా ఉంటున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆమె ప్రస్తావన వచ్చింది. తమ దేశానికి తిరిగి పంపించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు లేఖ రాయడం సంచలనం రేపింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ చేసేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలోనే లేఖ రాసినట్లు వార్త బయటకు వచ్చింది.
Also Read: Plane Crash: కుప్పకూలిన విమానం.. 10 మంది మృతుల్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త
బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని రహాస్య ప్రాంతంలో షేక్ హసీనా శరణార్థిగా ఉన్నారు. అయితే హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నాయకులు, సలహాదారులు, సైనిక అధికారులపై తీవ్ర నేర ఆరోపణలు నమోదయ్యాయి. ఆ విచారణలో భాగంగా షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రెబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను పంపించాలని బంగ్లాదేశ్ అధికారికంగా భారత్‌ను కోరింది.
Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ'
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని దౌత్యమార్గంలో భారత్‌ను సంప్రదించినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. న్యాయ ప్రక్రియలో విచారణ చేపట్టేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటోందని.. ఈ విషమై అధికారికంగా లేఖ రాసినట్లు ఆ దేశ వ్యవహారాల సలహాదారుడు తౌహిద్ హుస్సేన్ వెల్లడించారు. బంగ్లాదేశ్ హోం శాఖ కూడా హసీనాను తిరిగి దేశం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే విదేశాంగ శాఖకు లేఖ రాశామని.. ఆ ప్రక్రియ కొనసాగుతోందని అక్కడి హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ తెలిపారు. వ్యక్తుల అప్పగింతకు భారత్‌తో తమకు ఒప్పందం ఉందని.. ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి తమ దేశం తీసుకెళ్తామని జహంగీర్ ఆలమ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.