బ్రిటన్ కు మరోసారి నోబెల్ పురస్కారం దక్కింది. నవలా రచయిత కజువో ఇషిగురో రాసిన "ది రిమైన్స్ అఫ్ ది డే" పుస్తకానికి సాహితీ రంగంలో నోబెల్ పురస్కారం వరించినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. 62 ఏళ్ల ఇషిగురో జపాన్ లోని నాగసాకీ లో జన్మించారు. బాల్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు బ్రిటన్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. 1982 లో "ది పేల్ వ్యూ అఫ్ హిల్స్" అనే మొదటి నవలను రాశారు. అదే సంవత్సరంలో ఆయనకు బ్రిటన్ పౌరసత్వం లభించింది.
ఇషిగురో నవలల్లో అద్భుతమైన భావోద్వేగ శక్తి ఉంటుందని, కల్పిత భావాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారని అకాడమీ కొనియాడింది. ఆయనను పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన "ది రిమైన్స్ అఫ్ ది డే" నవల హాలీవుడ్ లో సినిమాగా తెరకెక్కింది. ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారం లిస్ట్ లో ఇషిగురో పేరు లేదు. కానీ సడెన్ గా తన నవల నోబెల్ పురస్కారానికి ఎంపికై థ్రిల్ కు గురి చేసిందని కజువో అన్నారు. 1989లో "ది రెమైన్స్ అఫ్ ది డే" నవలకు మాన్ బుకర్ ప్రైజ్ వరించింది. 2017 డిసెంబర్ 10 వ తేదీన స్టాక్ హోమ్ లో జరిగే కార్యక్రమంలో ఇషిగురో నోబెల్ పురస్కారం తో పాటు 1.1 మిలియన్ డాలర్ల నగదు అందుకోనున్నారు.
Watch the very moment the 2017 #NobelPrize in Literature is announced! pic.twitter.com/7IcRm5Bb2f
— The Nobel Prize (@NobelPrize) October 5, 2017