గ్రామీ అవార్డులను క్లీన్ స్వీప్ చేసిన బున్రో మార్స్

ప్రముఖ పాప్ సింగర్ బ్రూనో మార్స్ కు అత్యధికంగా ఈ ఏడాది ఆరు కేటగిరీల్లో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు వరించాయి.

Last Updated : Jan 30, 2018, 06:44 AM IST
గ్రామీ అవార్డులను క్లీన్ స్వీప్ చేసిన బున్రో మార్స్

ప్రముఖ పాప్ సింగర్ బ్రూనో మార్స్ కు అత్యధికంగా ఈ ఏడాది ఆరు కేటగిరీల్లో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు వరించాయి. బ్రూనో పాడిన 'దట్స్ వాట్ ఐ లైక్' పాటకి ఆల్బం ఆఫ్ ది ఇయర్ లభించింది. ఇదే గీతానికి రికార్డ్ ఆఫ్ ది ఇయర్, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కాయి.

వీటితో పాటు మరో మూడు గ్రామీ అవార్డులను కూడా మార్స్ దక్కించుకున్నాడు. గ్రామీ అవార్డులను అందుకున్న ఇతర విజేతలలో రెండు అవార్డులను ఎడ్ శీరణ్ కు.. మరో జంట అవార్డులను రాపర్ క్రెండిక్ లామార్ కు దక్కింది. 'యు వాంట్ ఇంట్ డార్కర్' డాన్స్ కి బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ పురస్కారం దక్కింది. కాగా ఈ నృత్య ప్రదర్శన రూపకర్త లెనార్డ్ కోహెన్ మరణించిన తరువాత ఈ అవార్డు దక్కింది. దీనితో పాటు ప్రిన్సెస్ డయారిస్ట్ పేరుతో రూపొందిన ఆల్బం రూపకర్త కెరీ ఫిషర్ కు బెస్ట్ స్పోకన్ వర్డ్ ఆల్బం పురస్కారాన్ని ప్రకటించారు.

Trending News