చైనాలో పుట్టిన కరోనా వైరస్ ( corona virus) ..మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలోనే అదే చైనాలోని ఉత్తర ప్రాంతం నుంచి మరో ప్రాణాంతక వ్యాధి ఇప్పుడు భయపెడుతోంది. బ్యుబోనిక్ ప్లేగ్ ( Bubonic plague) గా చెబుతున్న ఈ వ్యాాధి బ్యాక్టీరియా కారణంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత దృష్ట్యా లెవెల్ 3 వార్నింగ్ ను జారీ చేశారు చైనా అధికారులు.
ఇన్నర్ మంగోలియా ( Inner mongolia) ప్రాంతంలోని బయన్నూర్ ( Bayannur) సిటీలో ఈ వ్యాధి లక్షణాల్ని తొలుత గుర్తించారు. బ్యాక్టీరియా కారణంగా విస్తరించే ఈ వ్యాధితో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని వైద్యులు చెబుతున్నారు. బయన్నూర్ నగరంలోని ఉరాద్ మిడిల్ ఆస్పత్రిలో చేరిన ఈ రోగికి ఈ వ్యాధి ఎలా సోకిందనేది ఇంకా తెలియలేదు. ఎలుకల కారణంగా ఈ బ్యాక్టీరియా మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. Also read: Corona medicine: కోవిడ్ 19 చికిత్సలో ఆ మందుల ప్రయోగాలు నిలిపివేత
వాస్తవానికి బ్యుబోనిక్ ప్లేగ్ ( Bubonic plague) అనే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బయటపడింది. 2017లో మడగాస్కర్ ( Madagascar) లో ఏకంగా 3 వందల కేసులు వెలుగు చూశాయి. చంకల్లో గడ్డల రూపంలో ఈ వ్యాధి మనిషి శరీరంలో బయటపడుతుంది. ప్రారంభంలో ఈ వ్యాధిని గుర్తించడం కష్టమే అయినా అనంతరం అంటే 3-4 రోజుల్లో వ్యాధి లక్షణాలు జ్వరం రూపంలో బయటపడతాయి. ఈ వ్యాధికి ఉన్న మరో పేరు బ్లాక్ డెత్ ( Black death) . ఇది కూడా కరోనా వైరస్ లానే మహమ్మారిలా విస్తరిస్తుంది. గతంలో 14 వ శతాబ్దంలో ఈ వ్యాధి ప్రబలినప్పుడు వెంటనే గుర్తించలేకపోయారు. ఇప్పుడు గుర్తించగలగడం ఓ మంచి పరిణామం. అప్పట్లో ఈ వ్యాధి ధాటికి ఆఫ్రికా, ఆసియా, యూరోప్ ఖండాల్లో దాదాపు 5 కోట్ల వరకూ ప్రజలకు బ్యుబోనిక్ వ్యాధి వల్ల మరణించారు. 1665లో కూడా ఈ వ్యాధి మరోసారి విస్తరించినప్పుడు లండన్ లో పెద్దఎత్తున జనం చనిపోయారు. 19వ శతాబ్దంలో భారత్, చైనాలలో కోటి 20 లక్షల మంది మృత్యువాత పడ్డారు. తాజాగా జూలై 1 వ తేదీన మంగోలియా ప్రాంతంలో రెండు బ్యుబోనిక్ ప్లేగ్ కేసులు వెలుగుచూడటం భయాందోళనలు రేపుతోంది. Also read: USA: అమెరికాలో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు: 8 మంది మృతి
ప్రాణాంతవ్యాధి అయినా యాంటీ బయోటిక్స్ ను వాడి ఈ వ్యాధిని తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రపంచానికి కొత్తదేమీ కాదు. గతంలో చాలాసార్లు ఈ వ్యాధిని ప్రపంచం చవిచూసి ఉండటం, వైద్య పరిజ్ఞానం అప్పటితో పోలిస్తే అభివృద్ధి చెందడంతో బ్యుబోనిక్ ప్లేగ్ ను నియంత్రించవచ్చనేది నిపుణులు అభిప్రాయంగా ఉంది.