కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత పెద్ద కార్చిచ్చు

నెలరోజుల క్రితం కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు జనావాసాలు చుట్టేస్తోంది.

Last Updated : Aug 12, 2018, 05:22 PM IST
కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత పెద్ద కార్చిచ్చు

నెలరోజుల క్రితం కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు జనావాసాలు చుట్టేస్తోంది. ఇప్పటికే లక్షల ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసింది. ఇప్పుడు జనావాసాలను ఈ కార్చిచ్చు చుట్టేస్తోంది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలో ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌ విధించారు. ఈ కార్చిచ్చుతో ఏర్పడిన పొగ వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని పలు నగరాల్లో గాలిలో విషవాయువుల పరిమాణం పెరిగిందని అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పేర్కొంది.

కార్చిచ్చుతో ఏర్పడిన పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని..ముఖ్యంగా హృద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని అధికారులు చెప్తున్నారు. కార్చిచ్చు వల్ల వందల ఇల్లు కాలిబూడిదయ్యాయని, లక్షల ఎకరాల్లో అడవిని ధ్వంసం చేసిందని తెలిపారు. ఇప్పటికే 14 వేల ఫైరింజన్లు, నేవీ, ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ లు ఈ మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు దావానంలా మారి ఆ రాష్ర్టాన్ని దహించి వేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లను స్థానికులు ఖండించారు.

కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు

 

‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌’గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించి.. పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో 100 చోట్ల మంటలు అంటుకున్నాయని వెల్లడించిన నాసా.. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడా కూడా అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Trending News