Canada News: కెనడాలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సొంత దేశంలోనే విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయనున్నట్టు సమాచారం. నివేదికల ప్రకారం.. జస్టిన్ ట్రూడో సోమవారం లేదా ఈ వారంలోనే కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ ట్రూడో హయాంలో భారత్‌తో సహా అనేక ఇతర దేశాలతో కెనడా సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. కెనడాలో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతకుముందు, ట్రూడో ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన మంత్రి, ఉప ప్రధాన మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా రాజీనామా చేశారు. ఈ రాజీనామా ట్రూడోకు పెద్ద దెబ్బగా భావించారు. ఆమె దేశ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సటైర్లు వేశారు. ట్రంప్ ట్రూడోను కెనడా గవర్నర్‌గా పిలిచారు. కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా చేయాలని ట్రూడోకు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. నిజానికి అక్కడి నుంచి అమెరికాకు వస్తున్న అక్రమ వలసదారులు, అక్రమ మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడంలో కెనడా ప్రభుత్వం విఫలమైతే, కెనడాపై 25 శాతం సుంకం (పన్ను) విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి రుసుము కెనడా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ట్రూడో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా బుధవారం కెనడాలో లిబరల్ పార్టీ నేషనల్ కాకస్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. లిబరల్ పార్టీ కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్న సమయంలో ట్రూడో తాత్కాలిక నాయకుడిగా కొనసాగుతారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గత ఏడాది డిసెంబరులో, జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి కీలక మిత్రుడైన ఎన్‌డిపి నాయకుడు జగ్మీత్ సింగ్ మైనారిటీ లిబరల్ ప్రభుత్వాన్ని పడగొట్టే తీర్మానాన్ని ప్రవేశపెడతానని చెప్పారు.
కాగా ఈ మధ్యే కొందరు నాయకులు ట్రూడోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను పార్టీకి రాజీనామా చేయకుంటే ఎంపీలే కాకస్ సమావేశంలో తనను సాగనంపే ఛాన్స్ ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇక ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి పార్టీ నేతలు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారన్న గోప్యంగానే ఉంచారు. ఒకవేళ కొత్త నేత వచ్చిన తర్వాత పీఎం పదవిలో ట్రూడో కొనసాగాలంటే ఆయన అనుసరించాల్సిన వ్యూహంపై లిబరల్ పార్టీకి చెందిన సలహాదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎదురు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. స్వల్పకాలానికి నేతలను ఎంపి చేయడం లేదా ఎన్నికోవడం మాత్రమే మిగిలి ఉన్నాయి.
కాగా ట్రూడో దాదాపు 10ఏళ్లపాటు కెనడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉన్నప్పుడు ట్రూడో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత పార్టీ అతనికి ఎదురులేకుండా పోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి