China Parents forced their 8 years old son to watch TV total night: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇంటర్నెట్ ప్రపంచమే రాజ్యమేలుతుంది. అరచేతిలోని మైబైల్, ఇంట్లోని టీవీ ప్రపంచం మొత్తాన్ని చూపిస్తుంది. అందుకే మైబైల్, టీవీకి అందరూ బానిసగా మారారు. ముఖ్యంగా పిల్లలు. స్కూల్ నుంచి వచ్చారంటే.. మైబైల్, టీవీ చూడకుండా ఉండలేకపోతున్నారు. అదేపనిగా టీవీ, మొబైల్ చూస్తోన్న పిల్లలను సరైన మార్గంలో పెట్టలేక చాలామంది పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది పేరెంట్స్ తిట్టడం లేదా కొట్టడం చేస్తున్నారు. తాజాగా చైనాలోని ఓ జంట తమ ఎనిమిదేళ్ల కుమారుడు ఎక్కువగా టీవీ చూస్తున్నాడని రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించింది.
వివరాలు ఇలా ఉన్నాయి... సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో నివసించే దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఆ జంట పని మీద బయటకు వెళ్తూ.. త్వరగా హోంవర్క్ పూర్తి చేయాలని, రాత్రి 8.30 కల్లా నిద్రపోవాలని తమ కుమారుడికి చెప్పింది. పని అన్నారం వాళ్లు తిరిగొచ్చేసరికి బాలుడు టీవీ చూస్తూనే ఉన్నాడు. పైగా హోంవర్క్ కూడా చేయలేదు. ఆ తర్వాత బాలుడు నిద్రపోయాడు. దీంతో ఆగ్రహించిన తల్లి బాలుడిని ఎలాగైనా దారిలో పెట్టాలనుకుంది. కుమారుడిని నిద్రలేపి బలవంతంగా టీవీ ముందు కూర్చొబెట్టింది. టీవీ చూడమని చెప్పింది.
మొదట ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు.. కొంతసమయానికి అలసటతో కూర్చోలేకపోయాడు. నిద్ర ముంచుకొస్తుండడంతో టీవీ చూడడం కష్టంగా మారింది. దాంతో పడకుండానంటూ ఏడుపు మొదలుపెట్టాడు. నిద్రపోతానని తల్లిదండ్రులను వేడుకున్నాడు. అయినా కూడా పేరెంట్స్ వదల్లేదు. ఉదయం 5 వరకు టీవీ చూపెడుతూ.. నిద్రపోనివ్వకుండా చేశారు. దాంతో బాలుడు ఇంకోసారి టీవీ చూడనంటూ తల్లిదండ్రులకు చెప్పాడు.
తాము చేసిన పని తమ కుమారుడిపై సానుకూల ప్రభావం చూపిందని తల్లి చెప్పారు. అయితే ఇలాంటి శిక్ష విధించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల పెంపకంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే.. వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి.
Also Read: Cell Phone Tower: పట్టపగలే సెల్‌ఫోన్ టవర్‌ను చోరీ చేసిన దొంగలు.. ఏం కారణం చెప్పారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.