డ్రాగన్ కంట్రీపై విసుర్లు..!!

డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందంటున్న అమెరికా.. ప్రపంచానికి తెలియకుండా చైనా మోసం చేసిందని విమర్శించింది.

Last Updated : May 9, 2020, 08:48 AM IST
డ్రాగన్ కంట్రీపై విసుర్లు..!!

చైనాపై పెద్దన్న ఆగ్రహం
డ్రాగన్ కంట్రీపై తగ్గని కోపం

డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందంటున్న అమెరికా.. ప్రపంచానికి తెలియకుండా చైనా మోసం చేసిందని విమర్శించింది.

అంతే కాదు చైనాలో కరోనా వైరస్ కట్టడి కోసం మందు ఉన్నా ప్రపంచ దేశాలకు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఇప్పుడు మరోమారు డ్రాగన్ కంట్రీ చైనాపై మండిపడింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి, మృతుల సంఖ్య విషయంలో అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం లెక్కలు దాచిపెట్టిందని విమర్శించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో తెలిపారు. 

చైనా వుహాన్ లోని  ప్రయోగశాల పనికి రాదని ఆయన విమర్శించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాను చూశానని చెప్పారు. అక్కడి నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చి.. ప్రపంచ దేశాలకు విస్తరించిందని ఆరోపించారు. ఐనప్పటికీ చైనా అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలియకుండా దాచిపెట్టిందన్నారు. చైనా వుహాన్ ల్యాబ్ లో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించలేదన్నారు. అందుకే వైరస్ బయటకు వచ్చిందని తెలిపారు. చైనాలో ఇప్పటికీ కరోనా మహమ్మారికి జనం బలైపోతున్నారని  చెప్పారు. 

చైనాలో దాదాపు 120 రోజుల క్రితం వైరస్ పుట్టింది. ఈ విషయం తెలిసి కూడా డ్రాగన్ కంట్రీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని మైక్ పాంపియో విమర్శించారు. ఇది అమెరికా సహా ఇతర దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఇప్పటికైనా చైనా ప్రభుత్వం.. కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేయకపోగా.. అలాంటి చర్యలను అడ్డుకునే  ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 

ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడమే చైనా ధ్యేయమని మైక్ పాంపియో అన్నారు. చిన్న చిన్న దేశాలకు ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసి.. ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు పారదర్శకతను కోరుకుంటున్నాయి. కానీ చైనా ప్రవర్తన మాత్రం భిన్నంగా ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో ఇప్పుడు కరోనా సంక్షోభం ఉందని మైక్ పాంపియో అన్నారు. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టిందని తెలిసినప్పటికీ.. నిజమైన పుట్టుకపై ఇప్పటికీ స్పష్టత లేదని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News