కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాక్సిన్ ( Vaccine ) లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది.
కరోనా వైరస్ కట్టడికి అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఆస్ట్రాజెనెకా ( AstraZeneca ), మోడెర్నా( Moderna ), ఫైజర్ ( Pfizer ) వంటి కంపెనీల వ్యాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉండగా..రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్టర్ చేసేసింది. రష్యా వ్యాక్సిన్ ( Russia vaccine ) కూడా ఈ వారంలో మార్కెట్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఏకంగా నాలుగు వ్యాక్సిన్ లు తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు వ్యాక్సిన్ లను నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నట్టు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
ఈ నాలుగు వ్యాక్సిన్ లలో మూడింటిని ఇప్పటికే అత్యవసరసేవల్లో ఉన్నవారికి ఇచ్చారు. జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని..ఇప్పటివరకూ ఎటువంటి అసాధారణ లక్షణాలు నమోదు కాలేదని సీడీసీ ప్రకటించింది. Also read: Donald trump: మోదీ పేరే ప్రచారాస్త్రం ట్రంప్ కు