అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ( America Elections ) విమర్శలు..ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు మోదీ పేరు వాడుకుంటున్నారు ట్రంప్ ఇప్పుడు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్ధులుగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) , జో బైడెన్ ( joe biden ) ల మధ్య పోటీ తీవ్రమైంది. ఇరువురి మధ్య వాద ప్రతివాదనలు అధికమయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి ఓ ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారతదేశ ప్రదాని నరేంద్ర మోదీ పేరు వాడేసుకుంటున్నట్టు అర్ధమౌతోంది. మరీ ముఖ్యంగా భారతీయ ఓట్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యర్ధి డెమోక్రటిక్ పార్టీలో ఉపాధ్యక్షురాలిగా బరిలో ఉన్నది భారతీయ సంతతికి చెందిన అభ్యర్ధిని కావడంతో ట్రంప్ జాగ్రత్త పడుతున్నారు.
కరోనా పరీక్షల విషయంలో గొప్పగా వ్యవహరించారంటూ నరేంద్ర మోదీ ( Narendra modi ) ఫోన్ చేసి మరీ ప్రశంసించారని ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని నిజాయతీ లేని తమ దేశ మీడియాకు చెప్పాలని మోదీని తాను కోరారని కూడా ట్రంప్ చెప్పారు. ఇండియా కంటే ఎక్కువ కరోనా పరీక్షలు..అంటే 44 మిలియన్ టెస్టులు ఎక్కువగా చేశామని ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ అమెరికాలో ప్రవేశించే సమయంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉంటే..అదనంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ ఎద్దేవా చేశారు. అదే సమయంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని...అనేకమంది ప్రాణాలు కోల్పోయారంటూ బైడెన్ విమర్శించారు. Also read: America: ఆ దేశాక్షుడి వెంట్రుకలకు అంత డిమాండ్ ఎందుకు?