Corona virus: కరోనా మహమ్మారిపై ఓ స్టడీలో మరిన్ని ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. చాలా మంది కొవిడ్ బారిన పడి.. కోలుకుంటున్నప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని తాజా స్టడీలో తెలిసింది. 'జర్నల్ నేచర్ మెడిసిన్'లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు పబ్లీష్ అయ్యాయి.
ఏడాది లోపు..
ముఖ్యంగా కరోనా సోకిన మొదటి నెల నుంచి మొదటి సంవత్సరం వరకు ఆయా వ్యక్తుల్లో గుండె సంబంధి ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశముందని పరిశోధకులు కనుగొన్నారు.
కొవిడ్ బారిన పడకముందు ఎవరికైతే గుండే సంబంది సమస్యలు ఉంటాయో వారికి.. ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. అయితే గుండె సంబంధి సమస్యలు లేని వారికి కొవిడ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని పరిశోధనలో తేలింది.
పెరిగిన గుండె జబ్బులు..
కరోనా సోకడం వల్ల సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండె జబ్బులు ఉన్న వారిలో 4 శాతం అధికంగా హార్ట్ ఫేల్యూర్స్ వంటి గుండె జబ్బులు సహా మరణాలు సంభవించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఒక్క అమెరికాలోనే 30 లక్షల మంది కొవిడ్ సోకడం వల్ల కుండె సంబంధి సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది.
72 శాతం అధిక ప్రభావం..
ఎటువటి ఆరోగ్య సమస్యలు లేని వారితో పోలిస్తే.. గుండె జబ్బులు ఉన్న వారిలో కొవిడ్ సోకడం కారణంగా 72 శాతం అధికంగా కరోనా సంబంధి వ్యాధులు అధికంగా వస్తున్నట్లు పరిశోదకులు కనుగొన్నారు. 63 శాతం మంది మందిలో హార్ట్ ఎటాక్, 52 శాత మందిలో గుండె పోటు వచ్చే అవకాశముందని కూడా అధ్యాయం వివరించింది.
కొవిడ్ వల్ల సంభవించే గుండే సంబంధి ఆరోగ్య సమస్యలు మరణానికి దారితీయోచ్చని.. ఇలాంటి సమస్యలు జీవితాంతం వెంటాడొచ్చని సెంయిట్ లూయిస్‌లోని వాషింగ్డన్ యూనివర్సిటి మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియాద్ అల్ అలే అన్నారు.
ఇప్పటి వరకి ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ కారణఁగా 1.5 కోట్ల మందికి కొత్తగా గుండె సంబంది సమస్యలు వచ్చాయని జియాద్ అల్ అలే వివరించారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..కొవిడ్ టీకాలు వేయడం ద్వారా జనాలను కరోనా భారిన పడకుండా చేయడం ఒక్కటే మార్గమన్నారు అల్ అలే. ప్రపంచపవ్యాప్తంపగా అన్ని దేశాల ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఈ విషయాన్ని పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Also read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..
Also read: Corona end: ఈ ఏడాది చివరి నాటికి కరోనా తీవ్రమైన దశ అంతం: డబ్ల్యూహెచ్ఓ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook