Viral Video: రన్‌వేపై రెండు ముక్కలయిన విమానం - దడ పుట్టిస్తున్న దృశ్యం

చూస్తుండగానే ఒక విమానం రన్ వే పై రెండు ముక్కలైంది. కోస్టారికాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 02:34 PM IST
  • చూస్తుండగానే రెండు ముక్కలైన విమానం
  • కోస్టారికాలో జరిగిన సంఘటన
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటో
Viral Video: రన్‌వేపై రెండు ముక్కలయిన విమానం - దడ పుట్టిస్తున్న దృశ్యం

Viral Video: ఓ విమానం చూస్తుండగానే రెండు ముక్కలయ్యింది. దట్టంగా పొగలు వ్యాపించాయి. ఆ దృశ్యాలు చూస్తున్న వాళ్లలో దడ పుట్టించాయి. ఎంతమంది చనిపోయారో అన్న ఆందోళనను కలిగించాయి. లైవ్‌లో రెండు ముక్కలైన విమానం వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

కోస్టారికాలో ఈ సంఘటన జరిగింది. శాన్‌జోస్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో కార్గో విమానం ఈ ప్రమాదానికి గురయ్యింది. జర్మన్‌ లాజిస్టిక్స్‌ దిగ్గజ సంస్థ అయిన డీహెచ్‌ఎల్‌కు చెందిన బోయింగ్‌ 757 విమానం.. జుయాన్‌ శాంతామారియా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. కానీ, కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దీనిని గమనించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. కోస్టారికా ఎయిర్‌పోర్టు అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించడంతో విమానం ల్యాండయ్యింది. అయితే, రన్‌వేపై కొద్దిదూరం వెళ్లగానే విమానం అదుపుతప్పింది. దీంతో విమానం వెనుక చక్రాల వద్ద రెండు ముక్కలయ్యింది. ఆ సమయంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది పొగలను ఆర్పేశారు. 

ప్రమాదం జరిగిన సమయంలో ఆ కార్గో విమానంలో ఇద్దరు క్రూ సిబ్బంది ఉన్నారు. అదృష్టవ శాత్తూ వారికి ఏమీ కాలేదు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అక్కడే ఉన్న వాళ్లు విమాన ప్రమాదం జరిగిన దృశ్యాలను రికార్డ్‌ చేశారు.

Also Read: IPL 2022 DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానా!

Also Read: Akhil Akkineni: మాస్‌ లుక్‌లో అక్కినేని అఖిల్.. బ‌ర్త్‌డే పోస్ట‌ర్‌ అదిరిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News