న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి ఉనికి, ఆవిర్భావంపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా తన వైద్య నిపుణులను పంపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కోవిడ్ 19 వ్యాప్తికి చైనానే కారణమని తేలితే తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవలసి ఉంటుందని చైనా ధోరణిపట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
చైనా ఆహ్వానించనప్పటికీ తాము వెళ్లాలనుకుంటున్నామని, అక్కడేం జరుగుతోందో చూస్తామని అన్నారు. చైనాతో వ్యాపార ఒప్పందం మాకు సంతోషంగానే ఉందని, గత డిసెంబర్‌లో చైనాలోని హుబెయి ప్రావిన్స్ రాజధాని వుహాన్ లో ఈ మహమ్మారి ప్రాణాంతక కరోనా వైరస్ వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచే సంక్రమించిందా అనే అంశంపై అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు ఆధారంగా వాస్తవాలు వెలికి తీస్తామని అన్నారు.
కరోనా వైరస్ పుట్టుక మూలాల్ని దర్యాప్తు చేసేందుకు వుహాన్‌కు అమెరికా బృందాన్ని డోనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా స్పష్టంగా తిరస్కరించింది. అంతేకాకుండా తాము ఏ దర్యాప్తు బృందాన్ని అడుగుపెట్టనివ్వమని అగ్గిమీదగుగ్గిలమైంది. తాము కూడా కోవిడ్ 19 బాధితులమే కానీ నేరస్థులం కాదని, ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జెంగ్ షుయాంగ్ స్పందిస్తూ ఈ వైరస్ మానవాళి అంతటికీ శత్రువేనని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..