ఫేస్‌బుక్ మద్దతు హిల్లరీకే..!

                 

Last Updated : Oct 22, 2017, 03:46 PM IST
ఫేస్‌బుక్ మద్దతు హిల్లరీకే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2016 ఎన్నికల్లో ఫేస్‌బుక్ తనకన్నా ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఎక్కువ మద్దతిచ్చింది అని ఆయన తెలిపారు.

హిల్లరీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం కోసం మిలయన్ల డాలర్లు ఖర్చు చేశారని, ఆఖరికి ఫేస్‌బుక్ కూడా ఆమె పక్షమే నిలిచిందని ట్వీట్ చేశారు. ఇంతకు క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యన్ హ్యాకర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ విషయాలు పలు అనుమానాలకు తావిస్తూ, దర్యాప్తులకు కూడా నాంది పలికాయి. ఈ విషయం మీదే ట్రంప్ మాట్లాడుతూ, ఆ ఫేస్‌బుక్ యాడ్స్ వలన ఎవరెవరో పొందే లాభం కన్నా, కొన్ని అమెరికా ఛానళ్ళు ఫేక్ న్యూస్ ద్వారా సంపాదించే బిలియన్ల డాలర్ల లాభం చాలా ఎక్కువ అని తెలిపారు.

అయినప్పటికీ ఆ రష్యన్ యాడ్స్ విషయంపై తను దర్యాప్తుకు ఆదేశించానని, దోషులెవరో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఆ యాడ్స్ కోసం సొమ్ము ఎవరైతే చెల్లించారో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసి వెల్లడించాల్సిందే అని ట్రంప్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

Trending News