Flying Car: ఎగిరే కారు సిద్ధం, ధర ఎంతో తెలుసా

ఎగిరే కారు. ఇప్పుడిక ఇది కల కాదు. వాస్తవం. అటు రోడ్ పై ఇటు గాలిలో చక్కగా ఎగిరిపోతుంది. పరుగులెడుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ ఫ్లయింగ్ కారు నెదర్లాండ్ లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Last Updated : Oct 31, 2020, 07:55 PM IST
Flying Car: ఎగిరే కారు సిద్ధం, ధర ఎంతో తెలుసా

ఎగిరే కారు ( Flying car ) . ఇప్పుడిక ఇది కల కాదు. వాస్తవం. అటు రోడ్ పై ఇటు గాలిలో చక్కగా ఎగిరిపోతుంది. పరుగులెడుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ ఫ్లయింగ్ కారు నెదర్లాండ్ ( Netherland ) లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రోడ్ ట్రాఫిక్ కు, ఎయిర్ ట్రాఫిక్ కు చాలా తేడా ఉంది. ట్రాఫిక్ లో గంటలు జామ్ అయ్యే సమస్యల్నించి చెక్ పలకవచ్చు ఇక. డచ్ కంపెనీ ( Dutch company ) పాల్ వి ( Pal v )  తయారు చేసిన ఎయిర్ కార్ ను సిద్ధం చేసింది. ప్రపంచంలో ఇదే తొలి కమర్షియల్ ఫ్లయింగ్ కారు. నెదర్లాండ్స్‌ రోడ్లపై కమర్షియల్ ప్లయింగ్ కోసం అధికారిక ఆమోదం లభించింది. పాల్-వి లిబర్టీ ( Pal v liberty ) గా పిలిచే  ఎయిర్‌ కార్‌ను డచ్ కంపెనీ పాల్-వి తయారు చేసింది. ఈ ఎగిరే కారు చిన్న హెలికాప్టర్ , ఏరో డైనమిక్ కారులా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్‌లో దీని వేగం గంటకు 99 మైళ్లు కాగా..ఫ్లయింగ్ మోడ్ లో గరిష్టంగా గంటకు 112  మైళ్లు ఉంటుంది.

లిబర్టీ ఒక గైరోకాప్టర్ ( Gyrocopter ). అంటే పైన అమర్చిన రోటర్లు కారును పైకి లేపుతాయి. దీనికోసం కారు వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రొపెల్లర్ ఇంజన్ ఉంటుంది.  కారు హెలికాప్టర్ లానే కదిలినా,  వర్టికల్ గా మాత్రం టేకాఫ్ కాలేదు. ఈ ఫ్లయింగ్ కారు టేకాఫ్‌ కావాలంటే కనీసం 590 అడుగుల పొడవు రన్ వే అవసరం. అయితే డ్రైవింగ్ మోడ్‌లో ఉండగా రోటర్లను  యధాస్థితికి ఫోల్డ్ చేయడమనేది సాధారణం కాదు. దీనిపై ఇప్పుడు లిబర్టీ ఇంజనీర్లు దృష్టి సారించారు.

ప్రస్తుతానికి లిమిటెడ్ ఎడిషన్ కింద 90  ఫ్లయింగ్ కార్లను విక్రయించింది. ప్రీ-టాక్స్ ధర కేవలం 599 వేల డాలర్లు. అంటే 4 కోట్ల 47 లక్షలన్నమాట. మంచి డిజైన్ తో, అందంగా తీర్దిదిద్దడానికి ఇటాలియన్ డిజైనర్లను నియమించుకుంది. స్పోర్ట్ మోడల్ కారును 399 వేల డాలర్లకు విక్రయించనుంది. 2022 లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ధృవీకరణను  అందుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ  కారును స్లోవేకియాకు చెందిన క్లెయిన్‌ విజన్‌ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ కారు బరువు 11 వందల కిలోలు కాగా..2 వందల కిలోల బరవును మోయగలదు. నవంబర్‌లో నిర్వహించనున్న చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌లో రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టనున్నారు. ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. భూమికి 15 వందల అడుగుల ఎత్తులో గంటకు 620 కిమీల వేగంతో కారు దూసుకెళ్తుందని క్లెయిన్‌విజన్ సంస్థ వెల్లడించింది.  టూ సీటర్, ఫోర్ సీటర్ వెర్షన్లలో ఈ కారు విడుదల కానుంది. Also read: Crying photo: కంటనీరు తెప్పిస్తున్న ఆ ఫోటోలు..టర్కీ ఘోరానికి సజీవ సాక్ష్యాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News