Forbes Billionaires 2021: వరుసగా నాలుగవ సారి కూడా ప్రపంచ కుబేరుడు అతనే

Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుల జాబితా 2021 విడదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనే టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారు. ఇండియా నుంచి ముకేష్ అంబానీకు స్థానం దక్కింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2021, 06:32 PM IST
Forbes Billionaires 2021: వరుసగా నాలుగవ సారి కూడా ప్రపంచ కుబేరుడు అతనే

Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుల జాబితా 2021 విడదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనే టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారు. ఇండియా నుంచి ముకేష్ అంబానీకు స్థానం దక్కింది.

ఫోర్బ్స్ మేగజైన్ (Forbes Magazine)ప్రతియేటా విడుదల చేసే ఆ జాబితాపై అందరి కన్ను ఉంటుంది. ఆసక్తి కల్గిస్తుంది. 2021 ప్రపంచ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ స్థానం సంపాదించుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా జెఫ్ బెజోస్ ప్రపంచ ధనవంతుడిగా స్థానం నిలబెట్టుకోవడం విశేషం. టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఏకైక వ్యక్తి రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీ. ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ ఆస్థుల నికర విలువ 177 బిలియన్ డాలర్లు కాగా, ముకేష్ అంబానీ 84.5 బిలియన్ డాలర్లతో ఉన్నారు. 

ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో 151 బిలియన్ డాలర్లతో టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk)ఉన్నారు. ప్రముఖ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎమ్‌హెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ 150 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక అందరికీ సుపరిచితులైన బిల్‌గేట్స్ 124 బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఇక 5వ స్థానంలో 97 బిలియన్ డాలర్లతో ఫేస్‌బుక్(Facebook) అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు. ప్రపంచంలో నలుగురు మాత్రమే వంద బిలయన్ డాలర్లకు పైగా ఆస్థులు కలిగి ఉన్నారు. క్రిప్టోకరెన్సీ, స్టాక్ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రపంచంలో 35 మంది ధనవంతుల జాబితా పెరిగిందని ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. 2020 జాబితాలో 8 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 డాలర్లకు పెరిగి 13.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 493 మంది కొత్త వ్యక్తులు స్థానం సంపాదించుకున్నారు. వరల్డ్ టాప్ 10లో ఆరుగురు వ్యక్తులు టెక్నాలజీ రంగానికి చెందినవారు కావడం మరో విశేషం.

Also read: White Paint: ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్, ఏసీలకు ప్రత్యామ్నాయం ఇదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News