Abortion Right: గర్భంలో శిశువు ప్రాణం తీయడం ఇక ఆ దేశంలో చట్టబద్ధం

Abortion Right: ఓ మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికైనా ఉంటుందా, గర్భంలో శిశువు  ప్రాణం తీయడం కూడా అంతే నేరం. అదీ ప్రాణమే. అందుకే సాధారణంగా చాలా దేశాల్లో అబార్షన్ అనేది నిషేధం. మరి ఆ దేశంలో పరిస్థితి ఏంటి..పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2024, 08:16 AM IST
Abortion Right: గర్భంలో శిశువు ప్రాణం తీయడం ఇక ఆ దేశంలో చట్టబద్ధం

Abortion Right: ఆధునిక పాశ్చాత్త ధోరణిలో వేలం వెర్రి పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో విచిత్రమైన, అనైతిక చట్టాలు తయారవుతుంటాయి. ఇప్పుడు మరో వివాదాస్పద చట్టం చేసి వార్తల్లో కెక్కింది ఫ్రాన్స్ దేశం. ఈసారి ఏకంగా అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుల్లో చేర్చేసింది. అంటే తల్లి గర్భంలో ఉండే శిశువు ప్రాణం తీసే హక్కుని ఇచ్చేసింది ఆ దేశం. దీనిపై ఆ దేశంలో ఇప్పుడు మంటలు రేగుతున్నాయి. 

వివాదాస్పద, సంచలన చట్టాలకు వేదికగా మారిన ఫ్రాన్స్ దేశంలో మరో అత్యంత వివాదాస్పద, అనైతిక చట్టం రూపొందింది. ఆ దేశంలో అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుల్లో చేరుస్తూ చట్టం తయారైంది. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఫ్రాన్స్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుకు అనుకూలంగా 780 మంది ఎంపీలు, సెనేటర్లు ఓటేశారు. వ్యతిరేకంగా కేవలం 72 మంది ఓటేశారు. అబార్షన్ రాజ్యాంగహక్కు చట్టం ఆమోదం పొందిన వెంటనే అటు సంబరాలు ఇటు నిరసనలు రెండూ ఒక్కసారిగా పెల్లుబికాయి.

ఈ చట్టంతో అబార్షన్ రాజ్యాంగహక్కుగా చేర్చిన తొలిదేశంగా ఫ్రాన్స్ నిలిచింది. మై బాడీ మై ఛాయిస్ అంటూ కొత్త చట్టానికి మద్దతుగా నినాదాలిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే నినాదాన్ని ఈఫిల్ టవర్‌పై ప్రదర్శించారు కూడా. అంటే తల్లి గర్భంలో ఉండగానే శిశువు ప్రాణాలు తీసే హక్కును ఆ తల్లికి రాజ్యాంగం కల్పించింది. ఇప్పటికే వేలంవెర్రిగా అబార్షన్‌లు జరుగుతున్న క్రమంలో ఇక రాజ్యాంగబద్ధత వస్తే ఇక అడ్డేముంటుంది. 

అందుకే యాంటీ అబార్షన్ వర్గాలు, వాటికన్, రోమన్ కేథలిక్ బిషప్‌లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రన్ ఈ అబార్షన్  చట్టాన్ని రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి. 

Also read: Voter ID Card: ఓటర్ ఐడీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News