మంగళవారం వియన్నాకు తూర్పున ఉన్న బౌమ్గార్టెన్ సమీపంలో ఆస్ట్రియా యొక్క ప్రధాన గ్యాస్ పైప్ లైన్ హబ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక అనేక మంది గాయపడ్డారు అని పోలీసులు చెప్పారు. కానీ ప్రమాద పరిస్థితిని గమనిస్తే.. కనీసం ఒకరన్న చనిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు .
"ఉదయం 8:45 గంటల సమయంలో అగ్నిప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. కానీ ప్రాధమిక నివేదికల ప్రకారం అనేక మంది గాయపడ్డారు "అని పోలీసు ప్రతినిధి ఎడ్మండ్ త్రాగ్శ్చిత్జ్ అన్నారు.