Coronaupdate: పది లక్షలు దాటిన కరోనా కేసులు...

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వరల్డ్ ఓ మీటర్ తెలిపిన వివరాల ప్రకారం అధికారికంగా ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు ఒక మిలియన్ మార్కును చేరుకున్నాయి. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి ఆందోళన ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలకు వ్యాపించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షల మందికి పైగా సోకిందని WOM తెలిపింది. భయంకరమైన కరోనా ఐరోపాలో

Last Updated : Apr 2, 2020, 11:43 PM IST
Coronaupdate: పది లక్షలు దాటిన కరోనా కేసులు...

 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వరల్డ్ ఓ మీటర్ తెలిపిన వివరాల ప్రకారం అధికారికంగా ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు ఒక మిలియన్ మార్కును చేరుకున్నాయి. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి ఆందోళన ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలకు వ్యాపించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షల మందికి పైగా సోకిందని WOM తెలిపింది. భయంకరమైన కరోనా ఐరోపాలో సుమారుగా 5 లక్షలకు పైగా పాజిటివ్ అని తేలిందని, కాగా దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 51,45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. స్పెయిన్ లో గడిచిన 24 గంటల్లో 950 మరణాలను నమోదు చేసిందని, మొత్తం మరణాల సంఖ్య 10,096కు చేరుకుందని పేర్కొంది. 

మరోవైపు భారత్ లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే కొద్ది వారాల్లో త్వరితగతిన పరీక్షలు, కరోనా క్యారియర్స్  ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి తదితర ముందు జాగ్రత్తలపై రాష్ట్రాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.  కాగా ప్రధాని కరోనాకు సంబంధించిన గణాంకాలు వివరిస్తూ ఇప్పటివరకు యాక్టీవ్ కేసుల సంఖ్య 2000కు పైగా పెరిగిందని, ఇందులో 50పైగా మరణాలు సంభవించాయని, 151 మంది కోలుకున్నారని తెలిపారు. మరోవైపు గత రెండు రోజులనుండి వార్తల్లోకెక్కిన నిజాముద్దీన్ తబ్లీఘి జమాతే పరిసర ప్రాంతాలన్నింటినీ డ్రోన్ల సహాయంతో  శుభ్రపరచడానికి సంబంధిత అధికారులకు జారీ అయ్యాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News