గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఈ వారంలో కాసుల వర్షం కురవనుంది. 2014లో సుందర్‌కు సంస్థ 3,53,939 పరిమితులతో కూడిన షేర్లను కేటాయించింది. అవి బుధవారం ఆయనకు పూర్తిగా సొంతంకానున్నా యి. అమెరికా స్టాక్ మార్కెట్లలో గత వారాంతంలో నమోదైన ముగింపు ధర ప్రకారం.. ఆ షేర్ల విలువ ఇప్పుడు 38 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.2,500 కోట్ల పైమాటే. బుధవారం ఈ సొమ్ము సుందర్ చేతికి వస్తుందని సమాచారం. దీంతో పిచాయ్ రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది.
ఈమధ్య కాలంలో ఒక సీఈఓకి ఇంత పెద్ద మొత్తంలో షేర్ల ప్యాకేజీ దక్కడం ఇదే ప్రధమం. గడిచిన కొన్నేళ్లలో కార్పొరేట్ కంపెనీలు తమ సీఈవోలకు చెల్లించిన భారీ పారితోషికాల్లో ఇదొకటని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. పిచాయ్‌కి ఈక్విటీ కేటాయించినప్పటి నుంచి ఇప్పటివరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు బాగా పెరిగాయి. నలభై ఐదేళ్ల పిచాయ్ 2015లో గూగుల్ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత రెండుసార్లు మిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను అందుకున్నారు.