WHO: ఆ విషయంలో భారతదేశమే ప్రపంచానికి మార్గదర్శి ...

పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారతదేశం ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే శక్తి  భారతదేశానికి ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే వైరస్ విజృంభిస్తున్న

Last Updated : Mar 26, 2020, 01:16 AM IST
WHO: ఆ విషయంలో భారతదేశమే ప్రపంచానికి మార్గదర్శి ...

న్యూఢిల్లీ: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారతదేశం ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే శక్తి  భారతదేశానికి ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే వైరస్ విజృంభిస్తున్న ప్రదేశాల్లో వైద్య పరీక్ష సదుపాయాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Also Read:  దండం చేసి చెబుతున్నా.. ఆ మంత్రి ఆవేదన..

కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి సులభమైన మార్గాలు లేవని, భారత్ లాంటి దేశాలే మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశాల్లోనే కరోనా వైరస్ కట్టడిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. మరోవైపు బాధితుల సంఖ్య నాలుగు లక్షల ముప్ఫైవేలకు చేరువైంది. 

Read also :బట్టలు ఉతుకుతూ.. బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. ఫన్నీ వీడియో

మరోవైపు అన్ని దేశాలు మరింత కఠినమైన, వేగవంతమైన చర్యలు తీసుకోవలసిన అవసరముందని WHO ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయని, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని, ప్రస్తుతానికి దేశంలో దాదాపు 600లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉండగా మరో 34 మంది కోలుకున్నారని, ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 10 మంది మృతి చెందారని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News