S Jaishankar: వాక్ స్వాతంత్రం అంటే దౌత్యవేత్తలను భయపెట్టడం కాదు.. సమ్మిట్ లో ఏకీపారేసిన జైశంకర్..

External Minsister: కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడం వల్ల భారత్ వీసాల జారీని నిలిపివేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అదే విధంగా.. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్రదుమారంగా మారాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 27, 2024, 12:55 PM IST
  • కెనడాలో లో భారత దౌత్యవేత్తలపై వరుస దాడులు..
  • జస్టిస్ ట్రూడో వ్యాఖ్యలు ఖండించిన ఎస్ జైశంకర్..
S Jaishankar: వాక్ స్వాతంత్రం అంటే దౌత్యవేత్తలను భయపెట్టడం కాదు.. సమ్మిట్ లో ఏకీపారేసిన జైశంకర్..

Attacks Over Indian Diplomats In Canada: గత ఏడాది లండన్‌లోని భారత్ హైకమిషన్‌పై, శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌పై కొందరు దాడులకు పాల్పడ్డారు. అదే విధంగా భారత్ దౌత్యవేత్తలను బెదిరించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేవిధంగా చూస్తామన్నారు. 

Read More: Hair Spa at Home: ఇంట్లోనే ఇలా హెయిర్ స్పా చేసుకోండి.. మీ జుట్టు పొడుగ్గా.. ఒత్తుగా పెరుగుతుంది..

కొన్నిరోజులుగా.. కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడం వంటి  ఘటనలు తీవ్ర దుమారంగా మారాయి. దీనితో  భారత్ దేశానికి కెనడీయన్ల వీసాల జారీని నిలిపివేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.  ఆ సమయంలో కెనడియన్ తమతో చాలా చులకనగా ప్రవర్తించిందన్నారు.  ఇలాంటివి ఒక దేశానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో, కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారతదేశం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.  ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో..  భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్రసంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే.. భారత్ దీన్నిఖండిస్తూ.. కొన్నిరోజుల పాటు కెనడా దేశీయుల వీసాలను జారీ చేయడం నిలిపివేసింది. 

కెనడాతో భారతదేశం తన "కోర్ ఇష్యూ" అని నొక్కి చెబుతోంది. ఆ దేశంలో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు,  భారత వ్యతిరేక శక్తులకు ఇన్ డైరెక్ట్ గా సహాయం చేస్తున్నారని జైశంకర్ అన్నారు. "శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌లో దాడికి పాల్పడిన నిందితులను చట్టంలోకి తీసుకురావాలని, అదే విధంగా.. లండన్‌లోని మా హైకమీషన్‌లోకి ప్రవేశించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము జైశంకర్ పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఒక మీడియా  గ్రూప్ ఏర్పాటు చేసిన సమ్మిట్ లో విదేశాంగ మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత హైకమిషన్‌పై కొందరు ఖలిస్తానీ అనుకూల శక్తులు దాడి చేశాయి.  జూలైలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. అదే విధంగా.. సెప్టెంబర్‌లో కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఇలా వరుస ఘటనలతో కెనడాలో భారతీయుల భద్రత తీవ్ర దుమారంగా మారింది. కెనడాలోని ఖలిస్తానీ వారిపై దాడులను విదేశాంగ మంత్రి తీవ్రంగ ఖండించారు. 

"మనది ప్రజాస్వామ్యమని వారు (కెనడా) మాకు చెబుతూనే ఉన్నారు. వాక్ స్వాతంత్య్రం ఉంది, అందుకే ప్రజలు ఈ మాటలు చెబుతారని జైశంకర్ అన్నారు. "వాక్ స్వాతంత్ర్యం అంటే  తమ విధిని నిర్వర్తించే దౌత్యవేత్తలను భయపెట్టడానికి ఉపయోగించడం కాదని జైశంకర్ అన్నారు.

Read More: Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ అయిందా.. ? చేతిలో ఉన్న‌ది ఆ ఒక్క సినిమా మాత్ర‌మే..

దౌత్యకార్యాలయం, కాన్సులేట్‌లకు పొగ బాంబులు విసరడం, స్నేహపూర్వక రాజ్యానికి వ్యతిరేకంగా హింస,  వేర్పాటువాదాన్ని సమర్థించడం వాక్ స్వాతంత్ర్యం కాదు, ఇది వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడమేనని జైశంకర్ అన్నారు. ఈ దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జైశంకర్ అన్నారు. "UKలో, మా హైకమిషన్‌పై గుంపులు దాడి చేయడాన్ని తాము చూశామని,  తాము ఆశించిన రక్షణను పొందలేకపోయామని జైశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

 

Trending News