Ajay Banga Biodata: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా హైదరాబాద్‌లో చదివిన వ్యక్తి.. అజయ్ బంగా నేపథ్యం ఇదే..!

World Bank New Chief Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా తొలిసారి భారత సంతతికి చెందిన బాధ్యతలు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో జన్మించిన అజయ్ బంగా.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కూడా చదివారు. ఆయనను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 2, 2023, 08:20 PM IST
Ajay Banga Biodata: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా హైదరాబాద్‌లో చదివిన వ్యక్తి.. అజయ్ బంగా నేపథ్యం ఇదే..!

World Bank New Chief Ajay Banga: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన అజయ్ బంగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ముగియడంతో అజయ్ బంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెల 3న బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి బంగాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ పోస్ట్ కోసం ఇతరులు ఎవరూ పోటీ పడకపోవడంతో అజయ్ బంగా ఎంపిక లాంఛనమే అయింది. 

భారతీయ అమెరికన్ ఎన్నిక అంత ఈజీగా జరగలేదు. బంగాను 4 గంటల పాటు ఇంటర్వ్యూ చేసిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు.. ఏకంగా 25 ప్రశ్నలు అడిగారు. అన్ని రకాలుగా సమధానాలు చెప్పిన తరువాతనే ఆయనను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రకటించారు. అజయ్ బంగా నాయకత్వంలో పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా చూస్తున్నామని బోర్డు సభ్యులు గతంలోనే తెలిపారు. 

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఆర్థిక, అభివృద్ధి పనుల నిర్వహణలో ఆయనకు మంచి అనుభవం ఉంది. బంగాను నామినేట్ చేస్తున్నప్పుడు.. రానున్న సవాళ్లను ఎదుర్కొవడంలో చాలా అనుభవం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. బంగాతో కలిసి పనిచేయడానికి బ్యాంక్ ఉత్సాహంగా ఉందని.. అభివృద్ధి చెందుతున్న దేశాల సవాళ్లను అధిగమిస్తామని ప్రపంచ బ్యాంక్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అందరి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తామని వెల్లడించింది.  

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా మొదటిసారి భారతీయ సంతతి చెందిన వ్యక్తి అజయ్ బంగా ఎన్నికయ్యారు. ఆయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో కూడా కీలక పదవులు నిర్వహించారు. 2010-2021 మధ్య బంగా మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేశారు. ఆయన పూర్తి పేరు అజయ్‌పాల్ సింగ్ బంగా. 1959 నవంబర్  10న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. బంగా తండ్రి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. అజయ్ బంగా కుటుంబం పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినది. 

Also Read: Pawan kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రారంభం  

అజయ్ బంగా సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను కంప్లీట్ చేశారు. ఢిల్లీలోని స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. 1980లో ప్రముఖ కంపెనీ నెస్లే ఇండియాతో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 2007లో అమెరికా పౌరసత్వం కూడా పొందారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికవడం పట్ల మన దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News