Indian origin man sentenced to 10 months in Singapore over minor sexaul assult : భారత సంతతికి చెందిన 57ఏళ్ల వ్యక్తి.. సింగపూర్‌లో జైలు పాలయ్యాడు. పదిహేను ఏళ్ల అమ్మాయితో ఆన్లైన్లో పరిచయం పెంచుకున్నాడు ఆ వ్యక్తి. తర్వాత ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకుని.. తర్వాత కొంత డబ్బును ఇచ్చి పంపించేశాడు. మొదట తొలుత అతడు ఇచ్చిన డబ్బును తీసుకుని సైలెంట్‌గా వెళ్లిన ఆ అమ్మాయి.. తర్వాత అతనికి షాక్ ఇచ్చింది.
భారత సంతతికి చెందిన 57 ఏళ్ల అశోకన్ (Ashokan) కొన్నేళ్లుగా సింగపూర్‌లో (Singapore) ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది ఆయనకు ఓ 15ఏళ్ల అమ్మాయికి పరిచయమైంది. తర్వాత ఆమెకు అసభ్యకరమైన వీడియోలను పంపించాడు అశోకన్. తన కోరిక తీర్చమని కోరాడు. అందుకోసం డబ్బులు కూడా ఆఫర్ చేశాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒక హోటల్లో (Hotel) కలవాలనుకున్నారు. కానీ హోటల్ సిబ్బంది.. అశోకన్‌ను ఐడీ ప్రూఫ్ కోరడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.అనంతరం అతడు.. ఆ ఆమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిసిన అతను ఆ అమ్మాయికి 250 సింగపూర్ డాలర్లను ఇచ్చి పంపించాడు.
మొదట డబ్బులను తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ అమ్మాయి.. తర్వాత అశోకన్‌పై పోలీసులకు (police) కంప్లైంట్ చేసింది. అతను తనపై లైంగిక దాడి చేశాడని, కొన్ని రకాల సెక్స్ టాయ్‌లను ఉపయోగించి ఇబ్బంది పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు.. 15ఏళ్ల అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న కారణంగా అశోకన్‌కు 10 నెలల జైలు (jail) శిక్ష విధించింది.
Also Read : T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook