Iran Visa Free Travel: ఇక నుంచి ఇరాన్‌లోకి ఫ్రీ ఎంట్రీ.. భారతీయులకు గుడ్‌న్యూస్

Iran Visa Free For Indian: మన దేశం నుంచి ఇరాన్‌కు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 33 దేశాలకు సంబంధించి వీసా నిబంధనలు సడలించింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 11:34 PM IST
Iran Visa Free Travel: ఇక నుంచి ఇరాన్‌లోకి ఫ్రీ ఎంట్రీ.. భారతీయులకు గుడ్‌న్యూస్

Iran Visa Free For Indian: విదేశీ యాత్రికులను ఆకట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఇరాన్ ప్రభుత్వం. భారత్‌తో సహా 33 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వీసా నిబంధనలను రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ దేశాల పర్యాటకులు వీసా అవసరం లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో పర్యాటకాన్ని పెంచడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

భారత్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, మారిషస్ దేశాల వీసా అవసరాన్ని రద్దు చేసింది. ఇండోనేషియా, బ్రూనై, జపాన్, సింగపూర్, కంబోడియా, మలేషియా, వియత్నాం, బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా, హెర్జెగోవినా, సెర్బియా, క్రొయేషియా, బెలారస్ దేశాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. కాగా.. ఇప్పటికే రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా నుంచి వచ్చే సందర్శకులకు వీసా నిబంధనలను రద్దు చేసింది.

ఇరాన్‌ ప్రభుత్వం 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను మారుస్తున్నట్లు మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి వెల్లడించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ పట్ల ఉన్న ఆలోచన ధోరణి మారుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. 

ప్రస్తుతం సంవత్సరంలో మొదటి 8 నెలల్లో ఇరాన్‌కు చేరుకున్న విదేశీయుల సంఖ్య 4.4 మిలియన్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 48.5% అధికం. 27 దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే కెన్యా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక వీసా లేకుండా భారతీయులకు ఎంట్రీ ఇస్తుండగా.. తాజాగా ఇరాన్ ఈ జాబితాలో చేరింది. బార్బడోస్, భూటాన్, డొమినికా, హైతీ, మాల్దీవులు, మారిషస్, నేపాల్, సమోవా, ట్రినిడాడ్ & టొబాగో తదితర దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు.

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News