Japan’s Discovery: ఆ గ్యాస్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ అందిస్తున్నారు. ఓజోన్ వాయువు ( Ozone gas )...కరోనా వైరస్ ను చంపగలదంటున్నారు. అదేంటో చూద్దామా…

Last Updated : Aug 27, 2020, 11:03 PM IST
  • తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ ...కరోనా వైరస్ ను న్యూట్రలైజ్ చేస్తుంది
  • 0.05 నుంచి 0.1 పీపీఎం కలిగిన ఓజోన్ గ్యాస్ ను డిస్ ఇన్ ఫెక్టెంట్ గా వాడాలి
  • జపాన్ లోని ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
Japan’s Discovery: ఆ గ్యాస్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ అందిస్తున్నారు. ఓజోన్ వాయువు ( Ozone gas )...కరోనా వైరస్ ను చంపగలదంటున్నారు. అదేంటో చూద్దామా…

కరోనా మహమ్మారి ( Corona pandemic ) ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జపాన్ శాస్త్రవేత్తలు ( Japan’s scientists discovery ) కనుగొన్న విషయం ఆసక్తి రేపుతోంది. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువు ( low density ozone gas )...కరోనా వైరస్ కణాల్ని న్యూట్రలైజ్ చేయగలదని అంటున్నారు. అందుకే ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలు, కార్యాలయాలు వంటి ప్రాంతాల్లో వీటిని డిస్ ఇన్ ఫెక్టెంట్ గా ఉపయోగించాలని సూచిస్తున్నారు. జపాన్ లోని ఫుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. 

అయితి తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును మాత్రమే ఉపయోగించాలంటున్నారు. వైరస్ ఉన్న ఓ గదిలో ఓజోన్ జనరేటర్ ను ఉపయోగించి చూశారు. పది గంటల వరకూ తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ వినియోగంతో..వైరస్ శక్తి 90 శాతం ( virus strength reduces 90 percent ) తగ్గినట్టు ఫుజిటా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలున్న ప్రాంతాల్లో నిరంతరం తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును వదలడం వల్ల మంచి ప్రయోగాలుంటాయి. ఎందుకంటే  0.05 నుంచి 0.1 పీపీఎం కలిగిన ఓజోన్ గ్యాస్ మనిషికి హాని చేయదని..వైరస్ ను చంపగలదని ఈ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఓజోన్ అనేది ఓ రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక రకాల వ్యాధి కారకాలను ఇన్ యాక్టివేట్ చేస్తుంది. ఎక్కువ సాంద్రత కలిగిన వాయువైతే మాత్రం మనిషికి హాని కల్గిస్తుంది. 1-6 పీపీఎం ఉన్న ఓజోన్ గ్యాస్ అయితే కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పనిచేస్తుంది కానీ మానవునికి హాని కల్గిస్తుంది. ఇప్పటికే ఈ యూనివర్శిటీ హాస్పటల్, వెయిటింగ్ రూమ్ లు, రోగుల గదుల్లో వైరస్ సంక్రమణ తగ్గించేందుకు ఓజోన్ జనరేటర్లు ( ozone generators ) వినియోగిస్తోంది. Also read: Russian’n vaccine: స్పుత్నిక్ వి పై ఇండియా ఆసక్తి

 

Trending News