సౌదీ అరేబియా చరిత్రను మొట్టమొదటిసారిగా ఒక మహిళ తిరగరాసింది. లు బ్నా అల్ ఓలాయెన్ అనే సౌదీ మహిళా వ్యాపారవేత్త కొత్తగా ఏర్పడిన బ్యాంకు చీఫ్‌గా బాధ్యతలు చేపట్టింది. సౌదీ బ్రిటిష్ బ్యాంకు (ఎస్‌ఎబిబి), అల్లావల్ బ్యాంకులు విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన బ్యాంకుకు డిప్యూటీ చైర్మన్‌గా ఓలాయెన్ నియమితులయ్యారు. 63 సంవత్సరాల ఒలయెన్ ఈ పదవిలో నాలుగేళ్లు సేవలందిస్తారు.
ఒలాయెన్ సౌదీ అరేబియాలో ఆర్థిక రంగంలో ప్రముఖ మహిళగా గుర్తింపు పొందారు. మధ్య ప్రాచ్యదేశాల్లో అత్యంత ప్రభావ శాలి మహిళల్లో ఒలాయెన్2018 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ విజన్ 2030ని దృష్టిలో ఉంచుకొని దేశంలో స్త్రీల సాధికారతకు పలు రకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సౌదీ మహిళలకు పెద్దపీట వేశారు.
ఈ ఏడాది జూన్ లో మహిళల డ్రైవింగ్ పై నిషేధం ఎత్తివేస్తూ.. సౌదీ మహిళలు కార్లు నడుపుకోవడానికి అధికారికంగా సౌదీ ప్రభుత్వం అనుమతి నిచ్చిన సంగతి తెలిసిందే..!
కాగా సౌదీ అరేబియాలో అతి పెద్ద బ్యాంకులో లు బ్నా అల్ ఓలాయెన్ బ్యాంకు మూడవ స్థానంలో ఉంది. ఈ కొత్త బ్యాంకులో బ్రిటీష్ మల్టీనేషనల్ బ్యాంక్ హెచ్‌ఎస్ బీసీ 13.2 బిలియన్ పౌండ్లు పెట్టుబడులు పెట్టింది.