కూలిన హెలికాఫ్టర్..ఇద్దరు పైలెట్లు మృతి

ఆర్మీ కార్గో హెలికాప్టర్‌ కుప్పకూలింది.

Updated: May 16, 2018, 01:51 PM IST
కూలిన హెలికాఫ్టర్..ఇద్దరు పైలెట్లు మృతి

నేపాల్‌ లోని ముక్తినాథ్‌లో ఆర్మీ కార్గో హెలికాప్టర్‌ కుప్పకూలింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ముక్తినాథ్‌లో ఆర్మీకి సంబంధించిన సరుకుల్ని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విపరీతమైన గాలి వీయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

విమానం బుధవారం ఉదయం 6:55 గంటలకు సుర్‌ఖేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఒక గంటలో ఈ గమ్యాన్ని చేరుకోవాలి. కానీ గమ్యానికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు విమానంతో సాంకేతిక సంబంధాలు తెగిపోయాయని అధికారి తెలిపారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.