Israel New Covid-19 Variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలు ఏంటంటే..!

Israel New Variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇప్పటికే చైనాలో కేసులు భారీగా పెరుగుతుండటం, తాజాగా ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో..ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 02:04 PM IST
Israel New Covid-19 Variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలు ఏంటంటే..!

Israel Records New Covid Variant: ప్రపంచవ్యాప్తంగా కరోన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ మధ్య తగ్గినట్టే తగ్గి..మళ్లీ కోరలు చాస్తోంది. చైనాలో కరోనా (Covid-19) అయితే కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ లో కరోనా కొత్త వేరియంట్ (Israel New Covid-19 Variant) వెలుగుచూసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొత్త కోవిడ్ వేరియంట్ సోకినట్లు గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి బుధవారం తెలిపారు.  ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ఒమిక్రాన్‌ (Omicron) వెర్షన్‌లోని రెండు సబ్‌ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లు కలిసి ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. 

"ఈ వేరియంట్ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు" అని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''వ్యాధి తీవ్రత గురించి తెలియాలంటే అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ఇది గత వేరియంట్లతో పోలిస్తే మరీ అంత డేంజర్ కాదని, దీని వల్ల మరో దశ ఉద్ధృతి ఉండకపోవచ్చని అనుకుంటున్నాం''’ అని ఇజ్రాయెల్‌ ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంతవరకూ స్పందించలేదు.

Also Read: South Korea Covid Cases: దేశంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదు!

లక్షణాలు:

స్వల్ప జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి వంటి మోస్తరు లక్షణాలు (Symptoms)..ఈ కొత్త వేరియంట్ లో కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త రకం ఫ్లొరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ జనాభా 9.2 మిలియన్లు. వీరిలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు మూడు కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులు వేసుకున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News