అక్వేరియం ( Aquarium ) అంటే వెంటనే గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన నార్త్ కరోలినా ( North Carolina ) అక్వేరియం. నిత్యం వేలాది సందర్శకులతో రద్దీగా ఉండే ఆ అక్వేరియం కరోనా కారణంగా మూతపడింది. ఆర్దిక ఇబ్బందుల్ని గట్టెక్కడానికి ఆ గుట్ట తవ్విచూస్తే...నిర్ఘాంతపోయారు.
నార్త్ కరోలినా అక్వేరియం ( North Carolina Aquarium ) లోపల్నించి వెళ్లగానే...చుట్టూ ఉన్న అక్వేరియంలో తేలుతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. అందుకే నిత్యం వేలాది మంది వస్తుంటారు. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటేన్ ( Smokey mountain ) నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్ ( Water falls ) కు ఓ ప్రత్యేకత ఉంది. 30 అడుగుల లోతులో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ లో నాణేలు వేసి కోరుకుంటే అది జరుగుతుందనే నమ్మకం ఉంది అక్కడ. అందుకేే వచ్చే సందర్శకులంతా నాణేలు విసురుతుంటారు. కరోనా కారణంగా అక్వేరియం మూతపడటంతో రోజువారీ నిర్వహణే కష్టమైంది నిర్వాహకులకు. కోర్కెలు నెరవేరేందుకు సందర్శకులు వేసిన విషింగ్ కాయిన్స్ ను ( Wishing coins ) బయటకు తీయాలని నిర్ణయించారు.
వారి అంచనాలకు అందకుండా...ఊహించని స్థాయిలో నాణేలు గుట్టలు బయటపడ్డాయి. జనం కోర్కెలన్నీ రాశులుగా దర్శనమిచ్చాయి. దాదాపుగా 100 గ్యాలన్ల నాణేలు ( 100 Gallons of coins ) ఆ ఫౌంటేన్ లో లభించాయి. ఈ నాణేల ఫోటోల్ని అక్వేరియం నిర్వాహకులు ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారు. నాణేల విలువ చెప్పమంటూ ప్రశ్నలు వేశారు. జనం అంచనా ప్రకారం 48 వేల డాలర్లు గానీ...64 వేల 427 డాలర్లు గానీ ఉండవచ్చు. అటు ఈ పోస్టుకు కూడా లక్షా 80 వేల లైక్స్ వచ్చాయంటే ఏ స్థాయిలో వైరల్ అయిందో ఊహించుకోవచ్చు. జనం అంచనా ఎలా ఉన్నా...కచ్చితంగా ఎంతనేది ఇప్పుడు లెక్కిస్తున్నారు. Also read: Moderna Vaccine: వ్యాక్సిన్ కోసం అమెరికా భారీ ఒప్పందం