Visit visa: ఒమన్ దేశపు బంపర్ ఆఫర్..వీసా అవసరం లేదు

Visit visa: విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఒమన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చని చెబుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

Last Updated : Dec 20, 2020, 03:22 PM IST
Visit visa: ఒమన్ దేశపు బంపర్ ఆఫర్..వీసా అవసరం లేదు

Visit visa: విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఒమన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చని చెబుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.. 

సౌదీ అరేబియా ( Saudi arabia ) దేశాల్లోని ఒమన్ ప్రభుత్వం ( Oman government ) సరికొత్త ఆఫర్ ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పథకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ పర్యాటకుల కోసం బంపర్ ఆఫరే అనౌన్స్ చేసింది. ఇండియా ( India ) సహా ప్రపంచంలోని 103 దేశాలకు ఈ అవకాశం లభిస్తుంది. గతంలో అయితే ఒమన్ దేశానికి వెళ్లాలంటే..నెల లేదా 3 నెలల విజిటింగ్ వీసా ( Visiting visa ) తీసుకోవల్సి వచ్చేది. వీసా కోసం 20-30 వేల వరకూ ఖర్చు కూడా అయ్యేది. ఇప్పుడా అవసరం లేదు. తాజాగా ఇచ్చిన వెసులుబాటు ప్రకారం పదిరోజుల పర్యటన కోసం ఎటువంటి వీసా అవసరం ( No visa ) లేదంటోంది. అయితే ఒమన్ దేశంలోని రాయల్ పోలీసు నిబంధనల్ని మాత్రం అనుసరించాలి. ఆరోగ్య భీమా, ఒమన్ వచ్చి వెళ్లేందుకు ముందస్తు టికెట్లు, బస చేసే హోటల్ వివరాలని పోలీసులకు అందించాలి. పది రోజుల పర్యటనలో పోలీసుల నిఘా ఉంటుంది.

Also read: Nepal: మరోసారి రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్ రద్దుకు సిఫారసు

Trending News