Karachi Blast: పాకిస్తాన్‌లోని కరాచీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఖరదర్ ప్రాంతంలోని బోల్టన్ మార్కెట్లో పేలుడు సంభవించింది. సోమవారం (మే 16) సాయంత్రం జరిగిన ఈ పేలుడు ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో 13 మంది వరకు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని వాహనాలకు నిప్పంటుకుంది. పేలుడుకు గల కారణాలేంటన్నది ఇప్పటికైతే వెల్లడికాలేదు. ఓ టూ వీలర్లో అమర్చిన బాంబు వల్లే పేలుడు ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Breaking: Huge blast targeting Chinese officials convoy in Karachi, Police vehicle severely damaged. Reports of casualities coming in. More details awaited. pic.twitter.com/bQgZGfXpFE
— Frontalforce 🇮🇳 (@FrontalForce) May 16, 2022
Breaking: Huge blast targeting Chinese officials convoy in Karachi, Police vehicle severely damaged. Reports of casualities coming in. More details awaited. pic.twitter.com/bQgZGfXpFE
— Frontalforce 🇮🇳 (@FrontalForce) May 16, 2022
Third blast in Karachi in 15 days. What's happening in our country?
— Sir Saith Abdullah (@SaithAbdullah99) May 16, 2022
కరాచీలో గడిచిన 15 రోజుల్లో ఇది మూడో పేలుడు ఘటన. దీంతో కరాచీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు కరాచీలో ఏం జరుగుతోందంటూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. చైనీస్ అధికారులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఇదే కరాచీలోని సద్దార్ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. సైకిల్లో అమర్చిన బాంబు పేలినట్లు బాంబ్ స్క్వాడ్ టీమ్ వెల్లడించింది.
అంతకు కొద్దిరోజుల ముందు ఇదే కరాచీలోని యూనివర్సిటీ ఆఫ్ కరాచీ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు చైనీస్, ముగ్గురు పాకిస్తానీలు మృతి చెందారు. ఆత్మాహుతి దాడి తమ పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజులకే కరాచీలో వరుస పేలుడు ఘటనలు చోటు చేసుకుంటుండటంతో... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటలిజెన్స్ టీమ్ రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడంలో బిజీగా ఉందంటూ ట్విట్టర్లో నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: KARATE KALYANI PRESS MEET : 'కరాటే కల్యాణి పారిపోదు.. పరిగెత్తిస్తది'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.