టిప్పు సుల్తాన్ పై పాకిస్తాన్ ప్రశంసల వర్షం

మైసూరు పాలకుడు టిప్పుసుల్తాన్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనను యుద్ధకళలలో ప్రావీణ్యం సాధించిన గొప్ప పోరాట యోధుడిగా పేర్కొంది. 

Last Updated : May 4, 2018, 06:21 PM IST
టిప్పు సుల్తాన్ పై పాకిస్తాన్ ప్రశంసల వర్షం

మైసూరు పాలకుడు టిప్పుసుల్తాన్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనను యుద్ధకళలలో ప్రావీణ్యం సాధించిన గొప్ప పోరాట యోధుడిగా పేర్కొంది. వివరాల్లోకి వెళితే టిప్పు సుల్తాన్ వర్థంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది.

"టిప్పు సుల్తాన్ ఓ ప్రభావవంతమైన చరిత్ర పురుషుడు. ఆయనను స్మరించుకోవడం ముఖ్యం. మైసూరు పులిబిడ్డ టిప్పు సుల్తాన్ వర్థంతి సందర్భంగా ఆయనను తలుచుకుందాం. తన చిన్నప్పటి నుండే టిప్పు సుల్తాన్ యుద్ధకళలలో రాటుదేలిన వ్యక్తి. అలాగే ఏదైనా నేర్చుకోవాలన్న తపన కలిగినవాడు" అని పాకిస్తాన్ ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ఈ క్రమంలో టిప్పు సుల్తాన్ పోస్టరును కూడా పోస్టు చేసింది. ఆ తర్వాత మరో ట్వీట్‌ను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పోస్టు చేసింది

ఆ ట్వీట్‌లో టిప్పు సుల్తాన్‌ని బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలినాట స్వాతంత్ర్య సమరయోధుడిగా పేర్కొంది. ఆయన 219వ వర్థంతి సందర్భంగా తనను స్మరించుకుంటున్నామని కూడా తెలిపింది. అయితే ఇదే ట్వీట్ పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. గతంలో కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల పై అమిత్ షా లాంటి నేతలు అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే.

అప్పుడు సిద్ధరామయ్య బహిరంగంగానే అమిత్ షాని తూలనాడారు. టిప్పుసుల్తాన్‌ని దేశం గర్వించదగ్గ యోధుడిగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా టిప్పు సుల్తాన్‌ని గొప్ప యుద్ధవీరుడిగా కొనియాడారు. కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Trending News