డ్రగ్స్ మితిమీరడంతో పాప్ సింగర్ మృతి

అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్‌(26) మృతి చెందాడు.

Updated: Sep 8, 2018, 12:35 PM IST
డ్రగ్స్ మితిమీరడంతో పాప్ సింగర్ మృతి

అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్‌(26) మృతి చెందాడు. లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. డ్రగ్స్‌ అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చిందని.. దానివల్ల మిల్లర్‌ మృతి చెందినట్లు తెలిపారు. కాగా గత కొద్దికాలంగా మ్యాక్‌ మిల్లర్‌ తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు అరియాన గ్రాండేతో బ్రేకప్‌.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో మ్యాక్‌ తీవ్ర డిప్రేషన్‌లోకి వెళ్లారని సన్నిహితులు పేర్కొన్నారు.

2012 నుంచి గ్రాండేను ప్రేమిస్తున్న మిల్లర్‌.. 2017లో ఆమెతో విడిపోయాడు. వీరిద్దరు కలిసి ఎన్నో ఆల్బమ్స్‌ చేశారు. జూన్‌లో అరియాన అమెరికా కమెడియన్‌ పిటె డెవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

మ్యాక్‌ మిల్లర్‌ మృతి పట్ల అమెరికన్ సింగర్స్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.