Russia’s Vaccine: వ్యాక్సిన్ సురక్షితమే

వివాదాస్పద రష్యా వ్యాక్సిన్ పై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. 

Last Updated : Sep 4, 2020, 08:26 PM IST
Russia’s Vaccine: వ్యాక్సిన్ సురక్షితమే

వివాదాస్పద రష్యా వ్యాక్సిన్ ( Russia vaccine ) పై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. 

ప్రపంచంలో అందరికంటే ముందు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రిజిస్టర్ చేసి సంచలనం సృష్టించింది రష్యా. అయితే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి ( Sputnik v vaccine ) వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు నెలకొన్న నేపధ్యంలో ఈ ప్రాజెక్టు కాస్తా వివాదాస్పదమైంది. అందుకే రష్యా మూడో దశ ప్రయోగాల్ని భారీగా 40 వేల మందిపై ప్రయోగిస్తోంది. ఇప్పుడీ వ్యాక్సిన్ సురక్షితమేనంటూ ప్రముఖ జర్నల్స్ లో ఆసక్తికర కధనాలు ప్రచురితమవుతున్నాయి. ముఖ్యంగా ది లాన్సెట్ ( The lancet ), బ్లూమ్ బర్గ్ ( Bloomberg ) వంటి ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్ లో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సురక్షితమేనని ( Russia vaccine is safe and secured ) అధ్యయనంలో తేలినట్టుగా వార్తలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. మనుషులపై చేసిన ప్రయోగాల్లో ఎటువంటి దుష్పలితాలు చోటుచేసుకోలేదని..యాంటీబాడీల పరంగా మంచి ఫలితాలొచ్చాయని ది లాన్సెట్ తో పాటు బ్లూమ్ బర్గ్ కూడా ప్రచురించింది.

ఈ వ్యాక్సిన్ ను ప్రాధమిక దశలో తీసుకున్న ప్రతి ఒక్కరికీ యాంటీబాడీలు బాగా అభివృద్ది చెందాయని ఈ జర్నల్స్ వెల్లడించాయి. జూన్- జూలై లో 76 మంది వాలంటీర్లపై రెండుదశల్లో ప్రయోగాలు నిర్వహించగా...నూటికి నూరుశాతం యాంటీబాడీస్ అభివృద్ధి కన్పించిందని ప్రచురించాయి.  ఈ 76 మందిలో 38 మంది పెద్దవాళ్లేనని జర్నల్స్ తెలిపాయి. వ్యాక్సిన్ ప్రధాన టార్గెట్ గా ఉన్న యాంటీబాడీస్ తయారీని స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సమర్ధవంతంగా నిర్వర్తించిందని ది లాన్సెట్, బ్లూమ్ బర్గ్ లు వెల్లడించాయి. Also read: COVID19 Vaccine: నవంబర్ 1 నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Trending News