Srilanka Crisis:శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనాల ఆందోళనతో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్డగోలుగా చేసిన అప్పులతోనే శ్రీలంకలో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ అప్పులు చేస్తున్నాయి. కొత్తగా అప్పు తేస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి
Srilanka Crisis: శ్రీలంక క్రికెటర్ చమికా కరుణరత్నేరెండు రోజులు క్యూలో నిల్చున్నాడు. అవును మీరు చదువుతున్నది నిజమే.. రెండు రోజులు క్యూలో ఉంటేనే తన కారులో కొన్ని లీటర్ల పెట్రోల్ పోయించుకోగలిగాడు.
Srilanka Next President: శ్రీలంక పార్లమెంట్లో మొత్తం 225 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో అధికార ఎస్ఎల్పీపీ సంఖ్యా బలం 117. గొటబాయ రాజపక్స రాజీనామా నేపథ్యంలో వచ్చే వారం స్పీకర్ పార్లమెంట్‌ను సమావేశపరచనున్నారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పాలకులపై ప్రజాగ్రహం పెల్లుబికుతూనే ఉంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండానే దేశం వీడి పారిపోయిన గొటబాయ రాజపక్సపై లంక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.
Srilanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయారని తెలియడంలో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకు దిగారు. పశ్చిమ శ్రీలంకలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో ఎమర్జెన్సీ విధించారు అధికారులు.
Srilanka Crisis: ఆర్థిక కష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. జనాగ్రహంతో ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. నిరసనకారులు ఎంటర్ కావడంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనం విడిచి పారిపోయారు
Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగమైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నెల క్రితం వరకు తీవ్ర ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తడంతో ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ శ్రీలంకలో నిరసనలు హోరెత్తాయి.
Srilanka Crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో విధించిన ఎమర్జెన్సీని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది.
Ranil wickremesinghe as Srilanka New PM: శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడైన 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు. అంతకు ముందు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో రణిల్ ఏకాంతంగా సమావేశమయ్యారు.
Sri lanka PM Resign: శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రజాందోళనలు మిన్నంటిన నేపథ్యంలో పదవి వదులుకోక తప్పలేదు. గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
Tamil Nadu to aid Srilanka:ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.
Srilanka President to Remove PM Mahinda : శ్రీలంకలో ప్రధాని మంతి మహిందా రాజపక్సేకు పదవీ గండం తప్పేలా లేదా ? పీఎం కుర్చీ లోంచి మహిందా రాజపక్సే తొలగింపునకు రంగం సిద్ధమైందా ? శ్రీలంక అధ్యక్షుడు తీసుకోబోయే తదుపరి చర్యలేంటి ? అక్కడి తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి ?
Srilanka Crisis Explained: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత ధీన స్థితిలోకి నెట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.