యుద్ధాల వల్ల అలిసిపోయాం.. శాంతి కోసం ప్రయత్నిస్తాం: తాలిబన్లు

ఈద్ వేడుకల సందర్భంగా తాలిబన్ సేనలకు చెందిన వ్యక్తులు యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపి.. పండుగను జరుపుకోవడానికి స్వగ్రామాలకు వెళ్లారు. 

Last Updated : Jun 20, 2018, 06:04 PM IST
యుద్ధాల వల్ల అలిసిపోయాం.. శాంతి కోసం ప్రయత్నిస్తాం: తాలిబన్లు

ఈద్ వేడుకల సందర్భంగా తాలిబన్ సేనలకు చెందిన వ్యక్తులు యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపి.. పండుగను జరుపుకోవడానికి స్వగ్రామాలకు వెళ్లారు. ఈ క్రమంలో తమ తల్లిదండ్రులను, భార్యబిడ్డలను, అమ్మమ్మలను, తాతయ్యలను కలిసి తమ ఆలోచనలు పంచుకున్నాక వారిలో చాలామంది తమ పంథా మార్చుకున్నట్లు తమకు తెలిసిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

"గత అనేక ఏళ్లు మేము ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నాం. చాలా యుద్ధాలు చేశాం. జిహాద్ కోసం, మా చోటును అక్రమంగా ఆక్రమించుకుంటున్న విదేశీయులను మట్టుబెట్టడం కోసం పోరాటాలు కూడా చేశాం. కానీ.. వీటి వల్ల మేము చాలావరకు అలసిపోయాం. అందుకే శాంతి బాట పట్టాలని భావిస్తున్నాం" అని అనేకమంది తాలిబన్లు బహిరంగంగానే చెప్పినట్లు తమకు తెలిసిందని ఆప్ఘన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఈద్ వేడుకలకు హాజరైన తాలిబన్లలో చాలామంది తమ మనసు మార్చుకోవడంతో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఇది కేవలం తాత్కాలికమైన చర్యేనా.. అన్న విషయంలో తమకు క్లారిటీ లేదని ఆప్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కూడా ఈద్ వేడుకల సందర్భంగా పలు చోట్ల భద్రతా దళాలకు సెలవులు ఇచ్చింది. తాలిబన్లతో పోరాడుతున్న సైన్యానికి కూడా కొంత వెసులుబాటు కల్పించింది. 2001 తర్వాత తొలిసారిగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానికి కొన్ని స్వస్తి చెప్పాలని భావించడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆఫ్ఘన్ రక్షణ శాఖ కూడా తెలిపింది. 

Trending News