Tennessee School Shootings: అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి

Tennessee School Shootings Death Toll: బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్‌విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్‌కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు. 

Written by - Pavan | Last Updated : Mar 28, 2023, 02:18 AM IST
Tennessee School Shootings: అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి

Tennessee School Shootings Death Toll: అమెరికాలోని నాష్‌విల్లేలో కాల్పుల మోతమోగింది. చిన్నపిల్లలు చదువుకుంటున్న స్కూల్లోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. ఇంకొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రీ-స్కూల్ స్థాయి నుంచి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరంతా మూడ్నాలుగేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే కావడంతో కాల్పుల మోతకు చిన్నారులు హడలిపోయారు.

బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్‌విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్‌కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు. బడిలో కాల్పులు జరిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారని తెలుసుకున్న చిన్నారుల కుటుంబాలు, ఆ బడిలో పని చేసే సిబ్బందికి సంబంధించిన కుటుంబాలు తీవ్ర భయాందోళనరు గురయ్యాయి. 

పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు హతమవడంతో అతడి అరాచకం అంతటితో ఆగిందని.. లేదంటే ఆ దుర్మార్గుడు ఇంకెంత మందిని పొట్టనపెట్టుకునే వాడో అనే భయాందోళన చిన్నారుల తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనిపించింది. అయితే విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడి ఇంతటి దుర్మార్గానికి తెగబడిన ఆ ఆగంతకుడి అసలు లక్ష్యం ఏంటి ? ఎందుకు ఇలా కాల్పులు జరిపి ఆరుగురుని పొట్టనపెట్టుకున్నాడు ? ఈ స్కూల్‌నే లక్ష్యంగా ఎంచుకోవడానికి ఏమైనా ప్రతీకారం లాంటి కోణాలు ఉన్నాయా ? అసలు ఈ కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు ఎవరు ? ఈ స్కూల్‌తో అతడికి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో అమెరికా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చదవండి : US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 25 మంది మృతి, పలువురు గల్లంతు..

ఇది కూడా చదవండి : Iran Earthquake: ఇరాన్‌ని షేక్ చేసిన భూకంపం.. 165 మందికి గాయాలు

ఇది కూడా చదవండి : Earthquake in North India: ఆఫ్ఘాన్ లో భారీ భూకంపం.. వణికిన ఉత్తర భారతం.. 9 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News