Turkey earthquake death toll raised : టర్కీలో భూకంపం ధాటికి 18 మంది మృతి

చిన్న దేశం టర్కీని భూకంపం వణికించింది.  భూకంపం దెబ్బకు 18 మంది మృతి చెందారు. మరో  550 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం 5 గంటల 55 నిముషాలకు సంభవించిన భూకంపంతో జనం ఆందోళన చెందారు.

Last Updated : Jan 25, 2020, 11:24 AM IST
Turkey earthquake death toll raised : టర్కీలో  భూకంపం ధాటికి 18  మంది మృతి

చిన్న దేశం టర్కీని భూకంపం వణికించింది.  భూకంపం దెబ్బకు 18 మంది మృతి చెందారు. మరో  550 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం 5 గంటల 55 నిముషాలకు సంభవించిన భూకంపంతో జనం ఆందోళన చెందారు.  రిక్టర్ స్కేలుపై 6.8 మ్యాగ్నిట్యూడ్ లుగా భూకంప తీవ్రత నమోదైంది. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారని మంత్రి సులేమాన్ సోలు ప్రకటించారు. 
మరోవైపు భూకంప కేంద్రం గాజింటెప్ పట్టణానికి 218  కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు తెలుస్తోంది. భూమి అడుగున 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం వచ్చిన తర్వాత దాదాపు 35 సార్లు ప్రకంపనలు వచ్చాయని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. మరోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో అత్యవసర సేవలు అన్నీ అందుబాటులో ఉంచాలని .. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్  అధికారులను ఆదేశించారు. అటు టర్కీకి అవసరమైన సాయం అందించేందుకు ఈజిప్టు ముందుకొచ్చింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News