Italy: ఇప్పటిది కాదు..రెండు వేల ఏళ్ల నాటి శవాలివి

నిజంగా విశేషమే..ఏకంగా 2 వేల ఏళ్ల క్రితం నాటి మృతదేహాల్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. అదెలా సాధ్యమంటారా. ఇటలీలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ..

Last Updated : Nov 22, 2020, 06:01 PM IST
Italy: ఇప్పటిది కాదు..రెండు వేల ఏళ్ల నాటి శవాలివి

నిజంగా విశేషమే..ఏకంగా 2 వేల ఏళ్ల క్రితం నాటి మృతదేహాల్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. అదెలా సాధ్యమంటారా. ఇటలీలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ..

క్రీస్తుశకం కాదు..క్రీస్తు పూర్వం 79లో...పాంపేలోని ప్రాచీన రోమన్ సిటీ ( Roman city ) సమీపంలోని మౌంట్ వెసువిస్ అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ( Lava ) చుట్టుపక్కల గ్రామాల్ని కప్పేసింది. లావా నుంచి తప్పించుకోలేక కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది లావాలోనే చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయినవారి మృత దేహాలు చెక్కుచెదరకుండా భద్రంగా ఉండిపోయాయి. వాటినే ఇప్పుడు ఇటలీ ( Italy )కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. 

2017లో ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ ( Archeology Department ) తవ్వకాలు జరపగా..మూడు గుర్రాల శిలలు బయటపడ్డాయి. ఇటీవల అంటే నవంబర్ నెలలో మరో ఇద్దరు వ్యక్తుల శవ శిలలు కనుగొన్నారు. లావా నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన ఓ ధనికుడు, అతని సేవకుడి శవాలుగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకరి వయస్సు 18-25 ఏళ్లు, మరో వ్యక్తి వయస్సు 30-40 ఏళ్లుంటుందని తెలిపారు. లావా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భూగర్భ ప్రాంతంలోకి వచ్చి...ఇక్కడ లావాకు బలై ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఫోటోల్ని ఇటలీ పురావస్తు శాస్త్రవేత్తలు విడుదల చేశారు. Also read: Alaska: ఈ నగరంలో 2 నెలలు సూర్యుడు కనిపించడు

Trending News