100 సిరియా సైనికులను హతమార్చిన అమెరికా

అమెరికా సంకీర్ణ కూటమి గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Last Updated : Feb 9, 2018, 01:52 PM IST
100 సిరియా సైనికులను హతమార్చిన అమెరికా

అమెరికా సంకీర్ణ కూటమి గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. సిరియా దేశానికి చెందిన 100 మంది సైనికులను తాము మట్టుబెట్టామని తెలిపింది. డెర్‌ ఎజార్‌ ప్రావిన్స్‌లో తొలుత సిరియన్లు కాల్పులు చేయగా.. వాటిని తమ సైనికులు ఎదుర్కొన్నారని అమెరికా తెలిపింది. అయితే ఈ ఘటన సంభవించాక.. సిరియా ఫైటర్ ప్లెయిన్స్ రెబల్స్ అజమాయిషీలో ఉన్న తూర్పు ఘౌటౌ ప్రాంతంపై బాంబులతో దాడి చేశాయి.

ఆ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా సంకీర్ణ సేనలు రంగంలోకి దిగాయి. అమెరికా ఇప్పటికే సిరియాలోని కుర్దిష్ బలగాలకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిని తిప్పి కొట్టింది. ఇప్పటికే సిరియన్ ఆర్మీకి ఇరాన్ మిలిటెంట్లు,రష్యన్ల సేనల సహకారం ఉంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు సిరియా, అమెరికా
సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి

Trending News