US Airstrikes Syria: మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం? సిరియాపై అమెరికా వైమానిక దాడులు

US Airstrikes Syria: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందా? సిరియాపై అమెరికా వైమానిక దాడులే నిదర్శనమా? సిరియాలోని ఐసిస్ క్యాంపులను అమెరికా ధ్వంసం చేసింది.  US సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ దాడుల ఉద్దేశ్యం అమెరికా, దాని మిత్రదేశాలపై దాడి చేయాలనే ISIS  ప్రణాళికను అడ్డుకోవడమే.  

Written by - Bhoomi | Last Updated : Oct 12, 2024, 06:30 PM IST
US Airstrikes Syria: మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం? సిరియాపై అమెరికా వైమానిక దాడులు

US Airstrikes Syria: US సెంట్రల్ కమాండ్ సిరియాలోని అనేక ISIS శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. US సెంట్రల్ కమాండ్ ప్రకారం, దాడుల ఉద్దేశ్యం అమెరికా, దాని మిత్రదేశాలు,  పౌరులపై దాడి చేయాలనే ISIS  ప్రణాళికను విఫలం చేయడమే. అంతేకాదు ఐఎస్ఐఎస్ కార్యక్రమాలను పూర్తి అడ్డుకునేందుకే అమెరికా ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది . అయితే US సెంట్రల్ కమాండ్ ప్రకారం, శుక్రవారం ఉదయం ఈ దాడి జరిగిందని..ఈ దాడిలో  పౌరులెవరూ గాయపడలేదని పేర్కొంది. 

Add Zee News as a Preferred Source

అంతకుముందు సెప్టెంబర్ 29న అమెరికా సిరియాపై వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్-ఖైదాతో సంబంధం ఉన్న 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికా వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు US సెంట్రల్ కమాండ్ నివేదించింది. ఇందులో, అల్-ఖైదాతో సంబంధం ఉన్న హుర్రాస్ అల్-దిన్ గ్రూప్ అగ్ర నాయకుడు,  మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఉగ్రవాదులు సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత వహించారు. దీనితో పాటు సెంట్రల్ సిరియాలోని ఐఎస్ శిక్షణా శిబిరంపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో నలుగురు సిరియా నాయకులు ఉన్నారు.

Also Read: Toyota: టయోటా కారుపై ఏకంగా రూ.3.50వేల భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే  

US మిలిటరీ ప్రకారం, వైమానిక దాడి US ప్రయోజనాలతో పాటు మా మిత్రదేశాలు,  భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ISIS ప్లాన్స్ ను తిప్పి కొట్టడమే.  దాదాపు 900 మంది అమెరికన్ సైనికులు సిరియాలో మోహరించారు. US దళాలు ఈశాన్య సిరియాలోని తమ ముఖ్య మిత్రులైన కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలకు సహాయ సహకారాలు అందిస్తాయి. ఇప్పుడు మరోసారి సిరియాలోని ఐసిస్ క్యాంపులపై అమెరికా వైమానిక దాడులు చేసింది. వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే పౌరుల ప్రాణనష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. 

తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. గతంలో స్థానికంగా పెద్దెత్తున భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్ మళ్లీ పడగ విప్పకుండా అడ్డుకోవడంలో భాగంగానే ప్రస్తుత దాడులని తెలిపింది. దాదాపు 900 మంది భద్రత సిబ్బందిని సిరియాలో మోహరించింది అమెరికా. 

Also Read: Gold News:  బంగారం ధర భారీగా తగ్గే అవకాశం.. ఎంత వరకూ పడుతుందో తెలిస్తే పసిడి ప్రియులకు పండగే   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News