అగ్రరాజ్యం అమెరికాలో కరోనా (US CoronaVirus Cases) మరింతగా చెలరేగే అవకాశం ఉందని ప్రముఖ వైద్యుడు, కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డా. ఆంటోనీ ఫౌసీ అభిప్రాయపడ్డారు. ప్రజలు మాస్కులు ధరించకుండా, ఇలాగే నిర్లక్ష్యం వహించి ఈ పరిస్థితి కొనసాగితే రోజుకూ లక్ష కేసులు నమోదు అవుతాయని అమెరికా వాసులను ఆయన హెచ్చరించారు. కరోనాని కట్టడి చేయాలంటే ప్రస్తుతానికి మాస్కులు తప్పనిసరి అని సీడీసీ సంచాలకుడు డా. రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ సైతం సూచించారు. First vaccine: భారత్ లో తొలివ్యాక్సీన్ తీసుకునేది ఎవరు ?
ప్రస్తుతం ప్రతిరోజూ 40వేల వరకు కోవిడ్19(COVID-19) పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు నిర్లక్ష్యం కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేంత వరకు ఎన్ని మరణాలు సంభవిస్తాయో చెప్పలేమన్నారు. అమెరికాలో కరోనా చర్యలు, బయట కనిపిస్తున్న పరిస్థితులు ఏమాత్రం పోలిక లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జులైలో బ్యాంకు సెలవులు ఇవే..
అమెరికా ప్రజలు ఇప్పటికీ మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా సమావేశమవుతున్నారు. ఇది భవిష్యత్తుల్లో మరిన్ని కేసుల(COVID19 Cases in US)కు తావిస్తుందని, ఇప్పటికైనా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 2,628,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,27,286 కోవిడ్19 మరణాలు సంభవించాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
రోజుకు లక్ష కేసులు తప్పవు: ప్రముఖ వైద్యుడు వార్నింగ్