వీడియో: హ్యాండ్‌ బ్యాగ్‌తో పాటు ఎక్స్‌రే మెషీన్లోకి వెళ్లిన మహిళ..!

ఎక్స్‌‌రే మెషీన్‌ స్క్రీన్‌లో మహిళ ఇమేజ్‌ను చూసి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కయ్యారు.

Last Updated : Feb 14, 2018, 09:23 PM IST
వీడియో: హ్యాండ్‌ బ్యాగ్‌తో పాటు ఎక్స్‌రే మెషీన్లోకి వెళ్లిన మహిళ..!

బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే సెక్యూరిటీ చెక్స్‌ల్లో వస్తువులు పోతాయని భయపడ్డారా?. కానీ చైనాలో ఓ మహిళ అలానే భయపడింది. ఎక్కడ తన విలువైన హ్యాండ్ బ్యాగ్ పోతుందో అని.. మరో ఆలోచన లేకుండా రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ చెక్స్‌‌లో ఉపయోగించే ఎక్స్‌ రే మెషీన్‌లోకి హ్యాండ్‌ బ్యాగ్‌తో సహా తానూ ఎక్కేసింది. ఈ ఘటన దక్షిణ చైనాలో గల గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోని రైల్వే స్టేషన్‌లో జరిగింది.

ఎక్స్‌ రే మెషీన్‌ స్క్రీన్‌లో మహిళ ఇమేజ్‌ను చూసి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కయ్యారు. చెప్పులతో పాటు ఆమె ఎక్స్‌రే యంత్రంలోకి వెళ్లారు. ఆమె జాగ్రత్తగా బయటకు వస్తుందో లేదో అని అక్కడి వారందరూ ఆందోళనచెందుతుండగా... ఆమె యంత్రంలో నుంచి  భద్రంగా బయటకు వచ్చారు.  ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇదిగో ఆ వీడియోని మీరూ చూడండి..!

Trending News