World Elephant Day on Friday 12 August: ఈ భూ గ్రహంపై అతిపెద్ద క్షీరదం 'ఏనుగుల జాతి'. జీవ వైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణలో ఏనుగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సమస్త ప్రాణకోటి జీవించటానికి ఏనుగులు పరోక్షంగా సహాయపడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అటువంటి ఏనుగుల జాతి ప్రస్తుతం పెను ప్రమాదంలో పడింది. దంతాల స్మగ్లింగ్ ముఠాలు, ప్రకృతి విపత్తుల వల్ల గజ రాజులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి.
జీవ వైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ ప్రపంచంలో ఏ దినోత్సవం అయినా కూడా సంరక్షణకు అవగాహనల కోసం ఏర్పాటు చేసినదే. అలానే 'ప్రపంచ ఏనుగుల దినోత్సవం' కూడా గజ రాజుల సంరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం, వాటి సంరక్షనకై తీసుకోవాల్సిన చర్యలు గురించి ఏర్పాటు చేశారు.
2011లో కనజ్వెస్ట్ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతిపాదించారు. 2012లో సిమ్స్‌తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ను నిర్వహించింది. 2012 నుంచి 'ప్యాట్రిసియా సిమ్స్' ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి నాయకత్వం వహిస్తున్నారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణి సంస్థలు, ఎంతో మంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏంటంటే.. ఏనుగుల సంరక్షణకు చర్యలు చేపట్టడమే. గజ రాజుల ఆవాసాలను కాపాడటం, అక్రమ వేటను నిరోధించటం, ఏనుగు దంతాల అక్రమ రవాణాను నిరోధించడం మన బాధ్యత.
2017 జనాభా లెక్కల ప్రకారం దక్షిణ కర్ణాటక ప్రాంత అడవిలో దాదాపు 6,049 ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. అయితే సహజ మరియు మానవ నిర్మిత కారణాల వల్ల ఏనుగు మరణాలు సంభవిస్తున్నాయి. కర్ణాటక అటవీ శాఖ రికార్డుల ప్రకారం.. 2021లో రాష్ట్రంలో 79 ఏనుగులు చనిపోయాయి. వాటిలో 17 విద్యుదాఘాతంతో చనిపోగా.. వేట, సహజేతర కారణాల వల్ల మిగతావి మరణించాయి. 2022లో 11 ఏనుగుల మరణాలు సంభవించాయి. వాటిలో 10 సహజ కారణాల వల్ల సంభవించాయి. వివిధ కారణాల వల్ల ఏనుగుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పర్యావరణానికి అన్ని విధాలుగా మేలు చేసే ఏనుగులను సంరక్షించడం మన బాధ్యతగా భావించాలి.
Also Read: బంగారం ప్రియులకు శుభవార్త.. స్థిరంగా పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
Also Read: రాఖీ కట్టి తిరిగి వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు.. ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook