PUBG mobile app latest updates: PUBG Mobile india తో పాటు మరో 118 ఇతర చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత్‌లో ఇప్పటికీ నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబరు నుండి చైనా మొబైల్ యాప్స్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదు.
USA Bans China Apps: అమెరికా ప్రభుత్వం చైనాకు షాకిచ్చింది. చైనాకు చెందిన పలు యాప్స్‌ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ట్రంప్ త్వరలో అధ్యక్షపదవి గద్దె దిగడానికి ముందు ఈ చర్యలు తీసుకోవడం విశేషం.
పబ్జి గేమ్ కోసం పబ్జి లవర్స్ అంతా వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. కానీ పబ్జి గేమ్ ( PUBG game in India ) దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అడిగితే మాత్రం ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు.
చైనాకు భారత్ షాక్స్ మీద షాక్స్ ఇస్తోంది. భారత్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోన్న చైనా యాప్స్‌పై కేంద్రం సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరుపుతూనే ఉంది. తాజాగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 43 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద టిక్‌టాక్ పై బ్యాన్ ను పాకిస్తాన్ ఎత్తివేసింది. ప్రజాభిప్రాయం కంటే చైనా ఒత్తిడికే పాకిస్తాన్ ప్రభుత్వం విలువిచ్చింది. చైనా నుంచి పెరిగిన ఒత్తిడి నేపధ్యంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్.
చైనా యాప్స్ పై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్ టాక్, వీ చాట్ యాప్ ల నిషేధంపై వాషింగ్టన్ కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
చైనా దేశపు యాప్ వి చాట్ కు ఊరట లభించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. నిషేధాన్ని నిలిపివేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Paytm app back on Google Play Store: పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించిందన్న వార్త శుక్రవారం అటు వాణిజ్య వర్గాల్లో ఇటు పేటీఎం యూజర్స్‌లో సంచలనం సృష్టించింది. ప్లే స్టోర్ సేఫ్టీ యూజర్ పాలసీకి విరుద్ధంగా ఉందన్న కారణంతో పేటీఎం మొబైల్ యాప్‌ని ( Paytm mobile app ) ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
దేశంలో ఓ వ్యసనంగా మారిన పబ్ జీ గేమ్ పై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ త్వరలో ఆవిష్కృతం కానుంది.
అమెరికా-చైనా ( America china war ) కంపెనీల మధ్య వార్ అధికారికంగా మారింది. నా దేశానిది బ్యాన్ చేస్తే...నీ దేశానిది నిషేధిస్తామనేంతవరకూ వెళ్లింది. తాజాగా ఐ ఫోన్లను బ్యాన్ చేస్తామంటూ చైనా విదేశాంగ ప్రతినిధే నేరుగా బెదిరించడం గమనార్హం.
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
నిషేదిత టిక్‌టాక్ యాప్‌ను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాల్ని సమర్పించామని టిక్‌టాక్ ఇండియా అధిపతి అంటున్నారు.
47 Chinese clone apps: చైనా యాప్స్‌పై భారత్ మరోసారి ఉక్కుపాదం మోపింది. జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌లను ( China apps ) భారత్ నిషేధించింది. టిక్ టాక్ లైట్, కామ్ స్కానర్ అడ్వాన్స్ వంటి యాప్స్ తాజాగా నిషేధానికి గురైన యాప్స్ జాబితాలో ఉన్నాయి.
టిక్ టాక్ యాప్‌పై ( TikTok App ) భారత్ నిషేధం విధించడంతో ఆ యాప్‌ని అభివృద్ధి చేసి భారత్‌పైకి వదిలిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ ( Bytedance ) విలవిలలాడుతోంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని భారత్ నిషేధించగా ( 59 chinese apps banned ).. అందులో బైట్ డ్యాన్స్‌కి చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రపంచంలోని అన్నిదేశాలు చైనా ( China ) ను పక్కనపెట్టేస్తున్నాయి. మొన్న ఇండియా..నిన్న అమెరికా..నేడు బ్రిటన్ ( Britan ) . రేపు మరో దేశం. అన్నిదేశాలు వాదించేది ఒక్కటే. దేశ భద్రతకు చైనాతో ముప్పుందని. 5 జి నెట్ వర్క్ నుంచి చైనా కంపెనీల్ని తప్పించడానికి బ్రిటన్ యోచిస్తోందిప్పుడు.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
59 apps banned India: న్యూ ఢిల్లీ: చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టించింది. లఢఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఉన్న భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ ( India-China face off ) అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
TikTok app: కరోనావైరస్ సంక్రమణ, భారత్‌తో వివాదం నేపధ్యంలో చైనాను, చైనా యాప్స్‌ను నిషేధించాలన్న ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ ( TikTok )పై పడింది. అయితే, టిక్‌టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇతర ఇంకొన్నిఇతర యాప్స్ రంగంలోకి దిగుతున్నాయి.
China apps in India : న్యూ ఢిల్లీ: భారత సైనికులతో చైనా బలగాల ఘర్షణ తర్వాత భారత్ లో చైనాకు చెందిన మొబైల్ యాప్స్‌ని నిషేధించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ ( pib fact check ) ద్వారా ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( pib ) స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.