దేశంలో ఓ వ్యసనంగా మారిన పబ్ జీ గేమ్ ( PUB G ) పై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ త్వరలో ఆవిష్కృతం కానుంది.
నిషేధిత పబ్ జీ కు...ఫౌ జీ ( FAU-G ) ప్రత్యామ్నాయం కానుందా..త్వరలో పబ్ జీ స్థానంలో ఫౌజీ ( Fearless And United Guards ) పేరుతో మల్టీ ప్లేయర్ గేమ్ ( Multi player game ) ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ ( Bollywood actor Akshay kumar ) స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) పిలుపిచ్చిన ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈ గేమ్ ను తీసుకొస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ గేమ్ కు ఫౌజీ ( ఫియర్ లెస్ అండ్ యునైటెడ్-గార్డ్స్ ) గా పేరు పెట్టారు. ఫౌజీ అనేది హిందీ పదం. దీనర్దం సైనికుడు అని. కేవలం వినోదమే కాకుండా...సైనికుల త్యాగాల్ని ఈ గేమ్ ద్వారా తెలియజేయబోతున్నట్టు నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ గేమ్ ద్వారా లభించే ఆదాయంలో 20 శాతం వాటాను భారత్ కా వీర్ ట్రస్ట్ కు అందజేయనున్నట్టు అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ అభివృద్ధి చేసింది. అక్షయ్ కుమార్ దీనికి మెంటార్ గా ఉన్నారు.
ఇటీవలికాలంలో చైనాకు చెందిన పలు యాప్ లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పబ్ జీను కూడా నిషేధించింది. పబ్ జీకు అలవాటుపడిన వారంతా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఫౌజీ పేరుతో కొత్త యాప్ తీసుకువస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also read: IIT-JEE Exams: వాయిదా ప్రసక్తే లేదు...తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
FAU-G: పబ్ జీను రీప్లేస్ చేయనున్న పౌజీ