China apps: చైనా అప్లికేషన్స్ నిషేధంపై స్పందించిన కేంద్రం

China apps in India : న్యూ ఢిల్లీ: భారత సైనికులతో చైనా బలగాల ఘర్షణ తర్వాత భారత్ లో చైనాకు చెందిన మొబైల్ యాప్స్‌ని నిషేధించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై పిఐబి  ఫ్యాక్ట్ చెక్ ( pib fact check ) ద్వారా ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( pib ) స్పందించింది.

Last Updated : Jun 22, 2020, 08:40 AM IST
China apps: చైనా అప్లికేషన్స్ నిషేధంపై స్పందించిన కేంద్రం

China apps in India : న్యూ ఢిల్లీ: భారత సైనికులతో చైనా బలగాల ఘర్షణ తర్వాత భారత్ లో చైనాకు చెందిన మొబైల్ యాప్స్‌ని నిషేధించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( pib ) స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ( pib fact check ) ద్వారా ఈ విషయంపై స్పందించిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో.. చైనా యాప్స్‌ని (china apps) నిషేధించాలని కోరుతూ టెక్ కంపెనీలకు నేషనల్ ఇన్మర్మేషన్ సెంటర్ ( National information center) ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, వాటిని నెటిజన్లు నమ్మవద్దని పీఐబీ సూచించింది. ప్రభుత్వం, ఎన్ఐసీ అలాంటి ఉత్తర్వులను విడుదల చేయలేదని స్పష్టంచేసింది.

భారత్ (India) లో చైనాకు (china) సంబంధించిన కొన్ని మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తున్నట్లు, వాటి పనితీరును వెనువెంటనే పరిమితం చేయాలని టెక్ ఆధారిత కంపెనీలకు భారత ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఒక ఉత్తర్వు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ కంపెనీలైన యాపిల్ ( Apple), గూగుల్ (Google) పలు కంపెనీలకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Ministry of electronics and IT) నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ( National information center) ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆ ఫేక్ పోస్టులో (fack post) పేర్కొన్నారు. భారత్‌లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లల్లో వినియోగంలో ఉన్న చైనాకు చెందిన 13 అప్లికేషన్లు.. లైవ్ మీ, బిగో లైవ్, విగో విడియో, బ్యూటీ ప్లస్, కామ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, టిక్ టాక్, క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రొమ్ వే, ఆప్ లాక్, వి మెట్, గేమ్ ఆఫ్ సుల్తాన్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఫేక్ పోస్టులో ఉంది. కాగా ఆ ఉత్తర్వు అసత్యమని పీఐబీ పేర్కొంది.

అయితే లడాఖ్ సరిహద్దుల్లో చైనా భారత సైనికులకు చేసిన దురాఘాతాన్ని నిరసిస్తూ దేశంలో చైనాకు చెందిన యాప్‌లను, వస్తువులను బహిష్కరించాలని భారతీయులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్లే భారతీయుల మనోభావాలకు దగ్గరిగా ఉన్న ఈ ఫేక్ పోస్ట్ మరింత వైరల్ అవడానికి కారణమైంది.

Trending News