10th Class: 10th క్లాస్‌ తర్వాత ఈ కోర్సులు చేస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు తిరుగుండదు..

10th Class: 10th Class ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి కాసేపటి క్రితమే విడుదలయ్యాయి.  పదో తరగతి పరీక్షలు గత నెల 18న ప్రారంభమై.. మార్చి 30న ముగిశాయి.  ఈ నేపథ్యంలో 10 తర్వాత ఏయే కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2024, 12:16 PM IST
10th Class: 10th క్లాస్‌ తర్వాత  ఈ కోర్సులు చేస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు తిరుగుండదు..

10th Class: 10వ తరతిగి పరీక్షలను ఏపీలో  రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఎప్పటిలాగే ఈ సారి విద్యార్ధినులు టాప్‌లో నిలిచారు. విద్యార్ధుల భవిష్యత్తు దిశా నిర్ధేశం చేసే ఈ పరీక్షలు విద్యార్ధులకు చాలా కీలకమనే చెప్పాలి.

అయితే చాలా మంది విద్యార్ధులు సరైన దిశా నిర్ధేశం చేసే వారు లేక ఏదో ఒక కోర్సులో చేరిపోతుంటారు. కానీ 10వ తరగతి తర్వాత చేయబోయే కోర్సులు ఏంటి ? ఏవి చేస్తే విద్యార్ధుల మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే దానిపై కొంత మంది విద్యావేత్తలు ఏం చెబుతున్నారంటే..

విద్యార్ధులకు పదో తరగతి తర్వాత ఉన్నత చదువుల కోసం అనేక కోర్సులున్నాయి. ఒకపుడు విద్యార్ధులు టెన్త్ తర్వాత ఇంటర్‌లో చేరే వారు. కొంత మంది మాత్రం పదో తరగతి కాగానే.. టెక్నికల్ విభాగాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్మీడియట్‌తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్ డిప్లోమాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్ధులు తాము ఏ కోర్సు తీసుకుంటే అనువుగా ఉంటుందో అదే తీసుకోవాలి. పక్కవాడు ఏదో మంచి కోర్సులో చేరితే.. పోలో మంటూ అదే కోర్సులో జాయిన్ కావొద్దు. ఒకవేళ ఏదైనా కోర్సు చేయాలంటే తమ శక్తి, సామర్ధ్యాలను అనుసరించి భవిష్యత్తులో ఇబ్బంది కరం కాకుండా చూసుకోవాలి.

ఇంటర్‌లో MPC, BiPC, CEC, MEC అంటూ వివిధ గ్రూపులున్నాయి. ఈ కోర్సుల్లో ఎంపీసీ కెరీర్ ఎంచుకున్నట్టైతే ఇంజనీరింగ్ కెరీర్‌ బంగారు బాటలు వేసుకోవచ్చు. డిఫెన్స్ రంగంలో కూడా మంచి ఎంప్లాయ్‌మెంట్ బాగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు రాబట్టవచ్చు.

భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకునేవాళ్లు బైపీసీలో చేరొచ్చు. స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ వంటి మిగతా మెడిసిన్, అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. అంతేకాదు వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ వంటి విభాగాల్లో ఉన్నత విద్యను చదువుకోవచ్చు. బైపీసీలో ఫార్మాతో పాటు మెడికల్ ఇతర రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. 

సీఈసీ కోర్సుతో కార్పోరేట్ రంగంలో రాణించేవారికీ ఇదే సరైన విద్య. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరఈస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంత చేసుకోవచ్చు. మొత్తంగా ఎంఈసీ కోర్సుతో మంచి అవకాశాలు పొందవచ్చు.

టెన్త్ తర్వాత పాలిటెక్నిక్..

విద్యార్ధులు టెన్త్ తర్వాత పాలిటెక్నిల్ కోర్సును ఎంచుకుంటే ఇంజనీరింగ్ విభాగంలో అవకాశాలు విరివిగా ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ రెండో యేడాదిలో జాయిన్ కావొచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో  మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, కెమిల్, సివిల్, మెటలర్జీ వంటి కోర్సుల్లో చేరొచ్చు. పాలిటెక్నిక్ చదువు తర్వాత పారిశ్రామిక రంగాల్లో మంచి అవకాశాలుంటాయి.

ఐటీఐ..

టెన్త్ తర్వాత వృత్తి విద్యా కోర్సుల్లో చేరొచ్చు. ఐటీఐ ప రిధిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిసనింగ్ తదితర కోర్సుల్లో చేరొచ్చు. ఐటీఐ తర్వాత డైరెక్ట్‌గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవచ్చు.

అగ్రి పాలిటిక్ప్..

మన దేశం వ్యవసాయి ఆధారిత దేశం. రైతులకు మేలైనా వ్యవసాయ పద్దతులను నేర్పించడానికి ఆధునాతన వ్యవసాయంలో యంత్ర పరికాల వాడకం వంటి వాటిపై కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సులో చేరితే.. ఎరువులు, పురుగుల మందులు, సీడ్ కంపెనీలు.. వంటి వాటిలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Also read: Congress MP Candidates: కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. పార్టీని నమ్ముకున్నోళ్లకే ఛాన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News